శశికళ సీఎం అవ్వలేకపోవటానికి ఆ 'ఒక్క రూపాయే' కారణం!
Publish Date:Feb 14, 2017
Advertisement
ఒక్క రూపాయే కదా అని తేలిగ్గా తీసుకోకండి! ఒక్కో రూపాయే వందలు, వేలు, లక్షలు, కోట్లు అయ్యేది! అసలు రూపాయి పవర్ ఏంటో జయలలిత, శశికళకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. పురుచ్ఛితలైవీ అయితే చచ్చిపోయి బతికిపోయింది కాని.... శశికళకు జైలు తప్పలేదు. అదీ నాలుగేళ్లు! మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీకి దూరం! మొత్తం పదేళ్లు బూడిదలో పోసిన 'పన్నీర్' అయిపోయింది! దీనికంతటికి కారణం ఒక్క రూపాయని మీకు తెలుసా? 1991 నుంచీ 1996 దాకా జయలలిత తొలిసారి సీఎం అయ్యారు. అప్పుడు ఆమెను ఎవరూ అడగకున్నా ఓ పొలిటికల్ స్టంట్ చేశారు! అతి నిజాయితీకి పోయి నెలకు కేవలం రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించారు! ఆ నెలకు ఒక్క రూపాయే తరువాతి కాలంలో కొంపలు ముంచింది. ఇంత దాకా తీసుకొచ్చింది. అనవసర పబ్లిసిటీకి పోయి నెలకు రూపాయి అనటంతో.. 5ఏళ్ల పదవి కాలంలో ఆమె ఆదాయం కేవలం అరవై రూపాయలు అవ్వాలి! కాని, అధికారం పోయేనాటికి... అంటే 1991 నుంచి 1996 తరువాత... జయ ఆస్థులు అమాంతం 66కోట్లు పెరిగాయి! ఇదెలా సాధ్యమైంది? నెలకు రూపాయి జీతం తీసుకున్న అమ్మ ఆస్థులు అక్రమంగా పెరిగిపోయాయని సుబ్రమణియన్ స్వామి కోర్టులో కేసు వేశారు! ఇప్పటికి ఇరవై సంవత్సరాల కింద మొదలైన ఆ లీగల్ వ్యవహారం మొత్తానికి ఇవాళ్ల అంతిమ తీర్పు రుచి చూపించింది! శశికళ మరొక్క అడుగు దూరంలో వుండగా ... సీఎం పదవికి ఆమడ దూరంలోకి విసిరేసింది! చెన్నై కోర్టులో మొదలైన సుబ్రమణియన్ స్వామి పోరాటం బెంగుళూరు కోర్టుకు, తరువాత బెంగుళూరులోని కర్ణాటక హైకోర్ట్ కు, చివరకు, సుప్రీమ్ కోర్టుకు చేరింది. స్పెషల్ కోర్టు తప్పంటే హైకోర్ట్ ఒప్పని, హైకోర్ట్ ఒప్పంటే సుప్రీమ్ తప్పని తీర్పులు ఇస్తూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా సినిమా నడిపించాయి. కాని, జయ, శశికళ కీలక పాత్రల్లో కొనసాగిన ఈ మల్టీ స్టారర్ లో అంతిమ విజయం సాదాసీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వుంటూ వచ్చిన పన్నీర్ సెల్వమ్ ది అయింది! ఇప్పుడాయన తమిళనాడుని ఏలుకునే స్థితిలో కనిపిస్తున్నారు! కర్మ సిద్ధాంతం ఇంత వరకైతే సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు కాని... అప్పుడెప్పుడో జయలలిత ఊరికే జనాకర్షణ కోసం ప్రయోగించిన రూపాయి జీతం అస్త్రం తిరిగి తిరిగి ఆమె మీదకే వచ్చింది. ఆమె ఎలాగో గౌరవంగా తప్పించుకుని వెళ్లిపోయినా... చేసిన అవినీతి కర్మంతా శశికళను మాత్రం వీడటం లేదు!
http://www.teluguone.com/news/content/sasikala-45-72131.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation





