వింటేజ్ రోహిట్.. లార్డ్స్ లో రోహిత్ శర్మ విశ్వరూపం.!

Publish Date:Jul 19, 2026

Advertisement

ఇదే ఆఖరు మ్యాచ్ అన్నారు. ఫిట్ నెస్ లేదు. ఫామ్ లేదు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కు పనికి రాడు అని విమర్శలు గుప్పించారు. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ పై గత కొద్ది రోజులుగా..   సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి రోహిత్ రిటైర్మెంట్ పైనే భారీ స్థాయిలో చర్చ జరిగింది. వీటన్నిటికీ రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో బదులిచ్చాడు. విమర్శకులకు నోటితో కాకుండా బ్యాట్ తో సమాధానమించ్చాడు. ఒక అద్భుత సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆదివారం (జులై 18) జరిగిన మ్యాచ్ లో రో‘హిట్’శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలతో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి మ్యాచ్ ను దాదాపు గెలిపించినంత పని చేశాడు.  ఈ ఇన్నింగ్స్ ద్వారా తనలో సత్తా తగ్గలేదని, జట్టును ముందుండి నడిపించే సత్తా తనలో ఇంకా  పుష్కలంగా ఉందని చాటాడు. 

సాధారణంగా దూకుడుగా ఆడే రోహిత్, ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఒకింత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. లూజ్ బాల్ వచ్చే వరకూ వెయిట్ చేశాడు. స్టాల్ సెలక్షన్ కూడా సెలక్టివ్ గా ఉంది. లూజ్ బాల్స్ ను బౌండరీకి తరలిస్తూ.. మంచి బంతులకు గౌరవం ఇస్తూ ఇన్నింగ్స్ నిర్మించాడు.   క్రమంలో  53 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. అక్కడ నుంచి గేర్ మార్చాడు.  తన సహజ శైలికి భిన్నంగా కేవలం ఫోర్లూ, సిక్సర్లే కాకుండా.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ, వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ భారీ లక్ష్య ఛేదనను ముందుండి నడిపించాడు.  అలాగే తన   ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో కళ్లు చెదిరే సిక్సర్లు కూడా బాదాడు. చివరకు  110 బంతుల్లో 138 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఐదు కళ్లు చెదిరి సిక్సర్లు, 17 ఫోర్లూ బాదాడు.  

గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్‌పై, రాబోయే వన్డే ప్రపంచకప్‌లో స్థానంపై వ్యక్తమౌతున్న సందేహాలకు రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పేశాడు.    ఈ క్రమంలో రోహిత్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేలలో రోహిత్‌కు ఇది 34వ శతకం. దీనితో  అత్యధిక వన్డే శతకాల జాబితాలో విరాట్ కోహ్లీ (54), సచిన్ టెండూల్కర్ (49)ల తర్వాత స్థానంలో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే   ఇంగ్లాండ్ గడ్డపై ఇది రోహిత్ కు 8వ సెంచరీ, ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డు సాధించాడు. అలాగే   39 ఏళ్ల వయసులో, రోహిత్ సాధించిన ఈ సెంచరీతో    ఏ అంతర్జాతీయ ఫార్మాట్‌లోనైనా ఇండియా తరఫున ఆ వయస్సులో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంత వరకూ ఈ రికార్డు సచిన్ పేరుపై ఉండేది.  

By
en-us Political News

  
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.