Publish Date:Sep 13, 2026
సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది. అమీర్‌పేట్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శనివారం చోటుచేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి. హేమదుర్గ (26) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో పనిచే స్తోంది.
సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్న హేమదుర్గ.. రాపిడో బైక్‌పై అమీర్‌పేట్‌కు బయలుదేరింది. అయితే శ్రీనగర్ కాలనీలోని బిగ్ బజార్ వెనుక గేటు సమీపంలోకి చేరుకోగానే అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హేమదుర్గ ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
[ Road accident at Ameerpet, Srinagar Colony, Big Bazaar, Crime news, Rapido Bike, Driver Sheikh Anwar, Hyderabad police, Telangana police, CP Sajjanar, Telugu One, Telugu News ]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-accident-at-ameerpet-24-231382.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.