రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్, హరీష్.!
Publish Date:Sep 6, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీటెక్కాయి. నిన్న మొన్నటి వరకూ అధికార కాంగ్రెస్ అంతర్గత సంక్షోభాలు, కొండా సురేఖ బర్త్ రఫ్ అంశాలతో హాట్ హాట్ గా సాగిన తెలంగాణ పొలిటికల్ వాతావరణం.. ఇప్పుడు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో వేడెక్కింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విమర్శల దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శల దాడి పెంచడమే కాకుండా, పై చేయి సాధాంచేందుకు వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీ అగ్రనేతల సొంత నియోజకవర్గాలను లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత ఇబ్బందులు, రాజకీయ సవాళ్లను అనుకూలంగా మలుచుకుని ఆ పార్టీని దెబ్బతీయడానికి వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో.. పార్టీ బాధ్యత మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ తరుణాన్నే రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మాలచుకుని పావులు కదుపుతున్నారు. ఆ వ్యూహాలలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధమయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి, మరీ ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పెట్టని కోట లాంటిది. అటువంటి నియోజకవర్గంలో రేవంత్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సిరిసిల్ల బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. తన సిరిసిల్ల పర్యటనతో సిరిసిల్లలో గులాబీ పార్టీకి చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నారు. రేవంత్ దూకుడు అక్కడితో ఆగేటట్లు కనిపించడం లేదు. సిరిసిల్ల పర్యటన అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బలమైన సిద్ధిపేట నియోజకవర్గ పర్యటన ఉంటుందని ప్రకటించారు. సిద్ధిపేట నుంచి బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి విదితమే. కేటీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు స్థానాల్లో భారీ బహిరంగ సభల ద్వారా బీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ఈ బహిరంగ సభల ద్వారా గట్టి బదులు ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యంగా కీలక నాయకుల సొంత నియోజకవర్గాలలో సత్తా చాటడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెలలోనే సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే అక్టోబర్ లో సిద్దిపేట వేదికగా మరో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ లో ఉన్న ఇద్దరు బలమైన నాయకులతో ఆయన నేరుగా ఢీకొనేందుకు నిర్ణయించుకున్నట్లు పరిశీలకులు విశ్లే [Revanth Reddy Targets KTR And Harish Rao, Siricilla constituency, Siddipet constituency, BRS party, Telangana politics, Telugu One]
షిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-targets---ktr-and--harish-rao-24-230807.html




