తెలంగాణలో ఆటో ప్రయాణం ఇక ప్రియం.!

Publish Date:Sep 5, 2026

Advertisement

 

తెలంగాణలో రోజువారీ ప్రయాణం చేసే సామాన్యలు ఆటోల్లో ప్రయాణించాలంటే ఇక ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.    పెరిగిన ఇంధన ధరలు, విడిభాగాల ఖర్చులు, వాహనాల బీమా ప్రీమియంలను దృష్టిలో ఉంచుకుని   ఈ   నిర్ణయం తీసుకుంది.

ఆటో కార్మిక సంఘాలు గతంలో తలపెట్టిన సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రవాణా శాఖ అధికారులు కేరళ, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఆటో టారిఫ్ విధానాలను అధ్యయనం చేసి  నివేదికను రూపొందించారు.  ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఆటో ప్రయాణానికి సంబంధించిన కనీస ధర భారీగా పెరుగుతుంది.

ఇప్పటివరకు మొదటి రెండు కిలోమీటర్లకు అమలులో ఉన్న పద్ధతిని మార్చి, కొత్త నిబంధనల కింద మొదటి 1.6 కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీని   30 రూపాయలకు పెరిగే అవకావం ఉంది.  అలాగే..  ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు 11 నుంచి  14 రూపాయలకు పెరుగుతుంది.   ఆటో రంగంలోని వాస్తవ ఖర్చులను బేరీజు వేసి ఈ  పెంపును ఖరారు చేశారు. 

 కేవలం సాధారణ కిలోమీటర్ల చార్జీలే కాకుండా, ట్రాఫిక్ జామ్‌లలో ఆటో నిలిచిపోయినప్పుడు వర్తించే డిటెన్షన్ లేదా వెయిటింగ్ ఛార్జీలను కూడా కొత్త నిబంధనల్లో పొందుపరిచారు.  దీని ప్రకారం ట్రాఫిక్‌లో ఆటో ఆగిన ప్రతి నిమిషానికి 75 పైసల వెయిటింగ్ ఛార్జీని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి మరో భారం తప్పదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జరిగే ప్రయాణాలకు సాధారణ మీటర్ ఛార్జీపై అదనంగా 50 శాతం సర్ఛార్జ్  వసూలు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. వీటితో పాటు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీ విషయానికి వస్తే, ఒక సాధారణ బ్రీఫ్‌కేస్ లేదా హ్యాండ్‌బ్యాగ్ మినహా ఇతర పెద్ద ప్యాకేజీలకు ప్రతి దానికి 50 పైసల చొప్పున అదనపు రుసుము చెల్లించాలని, గరిష్టంగా 100 కిలోల వరకు లగేజీని అనుమతించవచ్చని పేర్కొన్నారు.   

[Auto Fare Hike Telangana, minimum auto fare  RS30, Transport Committee Recomand, Hyderabad Auto Charges, Auto Meter Tariff, Telugu One]

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.