ఏపీలో రోళ్లు పగిలే ఎండలు.. ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత

Publish Date:May 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు చండప్రచండంగా చెలరేగుతున్నారు. . మే నెలలో  ఎండల తీవ్రత సాధారణమే అయినా.. ఏపీలో ఈ తీవ్రత అసాధరణ స్థాయిలో ఉంది.   రాష్ట్రంలో వీస్తున్న పశ్చిమ, వాయువ్య గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.  సూర్యుడు నిప్పుల కొలిమిలా మారి .  ఏపీ  అగ్నిగుండాన్ని తలపిస్తోంది.  పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. పిడుగురాళ్లలో గురువారం ( మే 21)  ఏకంగా 48.1 డిగ్రీల సెలసియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు అంటే బుధవారం ( మే 20)  47.6 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత,   24 గంటల్లోనే మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరుకుంది.  

 పదేళ్ల కాలంలో పిడుగురాళ్లలో ఇంతటి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.   2016 నుండి 2025 వరకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ   45.5 డిగ్రీల మార్కు  దాటలేదు. 2019లో ఇక్కడ నమోదైన 45.5 డిగ్రీలే ఇప్పటివరకు గరిష్టం కాగా.. , ఇప్పుడు ఆ రికార్డులన్నీ చెరిగిపోయాయి. 2016 తర్వాత ఆంధ్రప్రదేశ్   చరిత్రలోనే నమోదైన రెండవ అత్యధిక ఉష్ణోగ్రత    48.1 డిగ్రీలు.  అంతకుముందు 2016 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో నమోదైన 48.6 డిగ్రీల సెలసియస్ ఉష్ణోగ్రత మొదటి స్థానంలో ఉంది. 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదౌతున్నాయి.  ఏపీలో  మొత్తం 688 మండలాల్లో దాదాపు 200 మండలాలలో  44 డిగ్రీలు,  అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.  పిడుగురాళ్ల తర్వాత గురువారం (మే 21) బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.6 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు  నమోదయ్యాయి.  ఎన్టీఆర్ జిల్లా తోర్రగుడిపాడులో 47.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.     తీవ్రమైన ఎండలు,  వడగాల్పుల ప్రభావం కారణంగా  ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా వనకురు గ్రామంలో పొలంలో పనిచేస్తూ కునపరెడ్డి రామకృష్ణ అనే రైతు, జగ్గయ్యపేటలో దార్ల కృష్ణ   అనే వ్యక్తి వడదెబ్బకు గురై మరణించారు.   

By
en-us Political News

  
1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ మ‌హానాయ‌కుడిగా రాణించిన అరుదైన వ్య‌క్తి ఎన్టీఆర్‌.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో సుందరంగా అలంకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.