వైద్య సేవలకు క్వాంటమ్ టెక్నాలజీ!

Publish Date:Aug 31, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర వైద్య సేవల రంగంలో  కొత్త సాంకేతిక అధ్యాయం ప్రారంభంకానుంది.   బాధితులకు వేగంగా,  ఖచ్చితత్వంతో వైద్య సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతను వినియోగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం   ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  క్వాంటమ్ మిషన్ లో భాగంగా ఈ  ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది. అత్యవసర సమయాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ  సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. 

ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్న 67   అంబులెన్సులను అనుసంధానించి వైద్య సేవలను అందించనున్నారు. దీనిని అభివృద్ధి చేసి, సమర్థంగా సేవలందించేందుకు నాలుగు  స్టార్టప్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. ఆధునిక కంప్యూటింగ్ పద్ధతులను ఉపయోగించి అంబులెన్సుల కేటాయింపు, అవి ప్రయాణించే మార్గాల ఎంపిక ఎప్పటికప్పుడు సమీక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా అంబులెన్స్ సేవలు   చాలా వేగంగా బాధితులకు అందుబాటులో వస్తాయి. 

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంబులెన్సులు సాధారణంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల సమీపంలో నిలిపి ఉంచుతారు. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే వాహనం ఘటనా స్థలానికి బయలుదేరుతుంది. అయితే  క్వాంటమ్ ఆధారిత వ్యవస్థ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది.  అత్యవసర పిలుపు వచ్చిన తర్వాత స్పందించడమే కాకుండా, ముందస్తుగా ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలను సాంకేతికత సహాయంతో గుర్తించి వాహనాలను సిద్ధంగా ఉంచుతారు.

 గడిచిన మూడేళ్ల అత్యవసర కాల్స్ సమాచారాన్ని, డేటాను అల్గారిథమ్ ద్వారా   విశ్లేషిస్తారు..  ఏయే ప్రాంతాల నుంచి ఎక్కువగా అంబులెన్స్ సేవలకు డిమాండ్ వస్తోందో గుర్తించి, ఆయా ప్రాంతాలకు సమీపంలోనే వాహనాలను   ఉంచుతారు. దీనివల్ల సమాచారం అందడంతోనే స్వల్ప వ్యవధిలోనే అవసరమైన ప్రాంతానికి అంబులెన్సులు చేరుకుంటాయి.   సమయం ఆదా కావడం ద్వారా బాధితులకు సకాలంలో  చికిత్స అందే వీలు కలుగుతుంది.

ఈ సాంకేతికత కేవలం అంబులెన్స్ పొజిషనింగ్‌కే పరిమితం కాకుండా, ప్రయాణ సమయాన్ని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.  గూగుల్ మ్యాప్స్ సేవలను కూడా దీనితో అనుసంధానించడం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన సమాచారం డ్రైవర్‌కు రియల్ టైమ్‌లో అందుతుంది. ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సాంకేతిక, వైద్య  నిపుణులు అంటున్నారు.


[Quantum Technology in Health Srevices,  AP Quantum Ambulance Services,  Healthcare AP, Guntur Pilot Project]

By
en-us Political News

  
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.