చెవిరెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు ఓకే.!

Publish Date:Sep 1, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు,  మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి  కోర్టులో రిలీఫ్   లభించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన విదేశీ పర్యటనకు  విజయవాడలోని  ఏసీబీ స్పెషల్ కోర్టు  అనుమతి మంజూరు చేసింది. మద్యం కుంభకోణం,  లుకౌట్ నోటీసుల నేపథ్యంలో చెవిరెడ్డి ప్రయాణంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఆయన తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు   విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ప్రయాణ అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు.

పిటిషన్‌ ను విచారించిన  కోర్టు, ఆయన అమెరికా పర్యటనకు కాలపరిమితితో కూడిన అనుమతి ఇచ్చింది. పరిమితిని నిర్దేశించింది. కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు   చెవిరెడ్డి సెప్టెంబర్ 3 నుంచి 13వ తేదీ వరకు   అమెరికాలో పర్యటించవచ్చు.  అలాగే అమెరికాలో ఆయన బస చేసే చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలను   కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

అంతే కాకుండా.. ప్రయాణానికి ముందుగానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అవసరమైన సెక్యూరిటీలను కోర్టులో సమర్పించాలలి.  అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే తన పాస్‌పోర్టును న్యాయస్థానానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. 

 

[Chevireddy Bhaskar Reddy Gets Relief in Court, Y CP Leader Chevireddy, Vijayawada ACB Court, US Travel Relief,  Overseas Travel Permission, Telugu One]

By
en-us Political News

  
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.