స్కూల్ యూనిఫాంల నాణ్య‌త‌పై విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్‌ : సీఎం రేవంత్

Publish Date:Jul 23, 2026

Advertisement

 

స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌) తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వ‌చ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇత‌ర అంశాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలు, వ‌స‌తిగృహాల్లో చ‌దివే విద్యార్థులకు అంద‌జేసే యూనిఫాంల నాణ్య‌త‌లో రాజీప‌డ‌మ‌ని సీఎం తెలిపారు.  

ఆగ‌స్టు 15వ తేదీ నాటికి పిల్ల‌లంద‌రికీ యూనిఫాం అంద‌జేయాల్సిన‌దేన‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌యంలో అల‌సత్వం వ‌హిస్తే స‌హించ‌న‌ని సీఎం హెచ్చ‌రించారు. మ‌హిళా సంఘాలు కుట్టు ప‌ని వేగ‌వంతం చేసేలా క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సెర్ప్ సీఈవో దివ్య‌కు సీఎం సూచించారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌లో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించార‌ని సీఎం అన్నారు. తాము వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని... నాణ్య‌మైన యూనిఫాంలు అందిస్తామ‌ని తెలిపారు.  

పేద పిల్లల కోసం పని చేస్తున్నామని అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. వచ్చే సంవ‌త్స‌రం జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థుల‌కు యూనిఫాం అందేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పి.సుద‌ర్శ‌న్ రెడ్డి, స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ స‌బ్య‌సాచి ఘోష్‌, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, ఆయా శాఖ‌ల అధికారులు బాల మాయా దేవి, ష‌ఫీ ఉల్లా, విజ‌యేంద్ర బోయి, దివ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

By
en-us Political News

  
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్ FDE ఉద్యోగాల డిమాండ్, రూ. 1.4 కోట్ల భారీ జీతాల ప్యాకేజీలు మరియు AI అమలులో వీటి ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
126 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ ఆనందం జింబాబ్వేకు ఇసుమంతైనా దక్కనీయకుండా.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతిలో సాంకేతిక మౌలిక వసతులను కల్పించడం, ఆర్థిక సేవల రంగాన్ని ఆధునీకరించడం, డిజిటల్ లావాదేవీలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంక్ అమరావతిలో ఇటువంటి అధునాతన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఏపీ పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.