ప్లెక్సీలను చించినా.. నా మనోబలం చెక్కుచెదరలేదు.!

Publish Date:Sep 21, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో   ప్రముఖ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి హాస్పిటల్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్   బాధ్యురాలు డాక్టర్ ప్రీతిరెడ్డి   వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారిలోని ఫ్లైఓవర్ పిల్లర్లు సహా  పలు ప్రాంతాల్లో డాక్టర్ ప్రీతిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన  పోస్టర్లు, ఫ్లెక్సీలను   గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం,   ఫొటోలకు నలుపు రంగు పూయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన ఫ్లెక్సీలు, పోస్టర్లు చించివేయడం, నల్లరంగు పూయడంపై   ప్రీతిరెడ్డి ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. 

 తన జన్మదిన వేడుక అన్నది  ఏ  రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చిన ప్రీతీరెడ్డి...  ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలు కేవలం తన శ్రేయోభిలాషులు, అభిమానులు, కాలేజీ సిబ్బంది,   ఆసుపత్రి స్టాఫ్ తమ అభిమానంతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినవన్నారు.  పుట్టినరోజు వేడుకలను కూడా రాజకీయం చేస్తూ తమ ఫ్లెక్సీలను చింపేయడం, వికృత చేష్టలకు పాల్పడడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతలా అణగదొక్కాలని చూసినా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు.   ఫ్లెక్సీలు చింపేయగలరు, కానీ తన మనోబలాన్ని మాత్రం  తన నుంచి దూరం చేయలేరన్నారు.  కేవలం ప్రచారం కోసమో,  రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ప్రజాక్షేత్రంలో తమ కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలు, విద్యా రంగంలో సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని   విమర్శలు గుప్పించారు.   


[Preethi Reddy, Malla Reddy daughter in law, Preethi Reddy flexis issue, Kompally, Suchitra, Telangana Nwes, Telugu One]

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ సీనియర్ నేత,  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాజెక్టు ముట్టడికి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంతో వనపర్తిలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జరిగిన హృదయ విదారక ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
సత్యం స్కాం భూములు.. కేటీఆర్ కుటుంబం చేతికి ఎలా వచ్చాయి..?
లేడీ గెటప్‌లో వచ్చి.. సీసీటీవీలపై స్ప్రేల దాడి..!
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే చప్పుళ్లకు వరుస గుండెపోటు మరణాలు..!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాద ఛాయలను నింపింది.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది.
మర్డర్ కేసులో వైష్ణవి సోదరుడితో పాటు మరో ముగ్గురి పాత్ర..!
మగపిల్లలకు పెళ్లి ముచ్చట లేదు.. టార్గెట్లు ఎలా పూర్తి చేయాలి.. ఆశా వర్కర్ల ఆవేదన..?
సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజాన్ ఉద్దీన్ మృతి చెందాడు.
రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.