విజ‌య్ కి చుక్క‌లు చూపిస్తున్న‌ఈ గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రు?

Publish Date:May 8, 2026

Advertisement

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ ఉన్నారు. ఈయ‌న గోవాలోని ప‌నాజీలో  1954 ఏప్రిల్ 23,న జన్మించారు. భారతీయ జనతా పార్టీలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా.. 2012-2015 మ‌ధ్య కాలంలో ప‌ని చేశారు. గోవా ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. భారతదేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా పేపర్ లెస్ చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత బీహార్ గవర్నర్‌గానూ పనిచేశారు.  జనవరి 2025లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2026 మార్చి 12 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత వివాదం విష‌యానికి వ‌స్తే.. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.  అయితే  ప్రభుత్వ‌ ఏర్పాటుకు కావాల్సిన 118 మ్యాజిక్ మార్కుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ మద్దతును  స్పష్టంగా చూపించాలని గవర్నర్  చెబుతున్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలైన కాంగ్రెస్ వంటి వాటి నుంచి రాతపూర్వక లేఖలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ హీటెక్కింది.

 గోవా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం వ‌ల్ల‌, గతంలో ఆయనకున్న బీజేపీ నేపథ్యం వల్ల.. స్థానిక నాయకులు, ఇత‌ర‌ సినీ ప్రముఖులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. రజనీ, కమల్, ప్రకాష్ రాజ్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అని చూస్తే వీరందరూ గవర్నర్ తీరును విమర్శించడానికి ప్రధాన కారణం రాజ్యాంగ సంక్షోభం. కేంద్రం పంపిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజల తీర్పును గౌరవించడం లేద‌ని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్.

రజనీ, కమల్.. నేరుగా గవర్నర్‌పై యుద్ధం ప్రకటించకపోయినా.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని వీరి ఆందోళన. గవర్నర్ అర్లేకర్  తీసుకునే నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనీ..  అందుకే ఆయన మెజారిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. ఒకవేళ ఆయన మద్దతు లేఖలు సమర్పిస్తే, గవర్నర్ తప్పనిసరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ లోపు జరుగుతున్న ఈ తాత్కాలిక అడ్డంకులే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.