నెల్లూరుజిల్లా: నెల్లూరుజిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపి మధ్యనే ఉంటుంది. అయితే ఈ ముగ్గురు అభ్యర్దుల్లో విజేత ఎవరో నిర్ణయించేది మాత్రం ఈ నియోజకవర్గంలోని సుమారు 10వేల మంది సిపిఎం సానుభూతిగల ఓటర్లే. ఈ ఎన్నికల్లో సిపిఎం తన అభ్యర్ధిని నిలబెట్టింది. సిపిఐ కూడా తన మద్దతును సిపిఎం అభ్యర్ధికే ప్రకటించింది. కోవూరు నియోజకవర్గంలో సిపిఎంకు సుమారు 10వేల మంది ఓటర్ల మద్దతు ఉంటుంది. సిపిఎం అభ్యర్ధి గెలిచే అవకాశాలు లేకపోయినా మిగిలిన ముగ్గురు అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి మాత్రం ఉంది. సిపిఎం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లనే చీల్చుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండుగా చీలిపోయిందని, అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు తమకు సానుకూలంగా ఉంటాయని టిడిపి భావిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ కు ఇక్కడ గట్టిదెబ్బే తగిలింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రూపు రాజకీయాలతో సతమతమవుతుంది. ఇక్కడ పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్ధి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రధానం గా వైఎస్ బొమ్మా, జగన్ పర్యటనలపైనే ఆశపెట్టుకుని ఉన్నారు. ఈనెల మూడు నుంచి జగన్ ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో బిజెపి పోటీ చేయడంలేదు. ఆ పార్టీ మద్దతు ఎవరికనేది మిస్టరీగా మారింది. పోటీలో ఉన్నా లేకపోయినా భావసారూప్యంగల పార్టీలు రంగంలోలేవని, అందువల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంగా ఉంటామని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nellore-24-12374.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.