విద్యార్థులు, యువతతో ఆర్ఎస్ఎష్ చీఫ్ భేటీ.. ఎందుకంటే?
Publish Date:Aug 6, 2026
Advertisement
ఆధునిక సాంకేతిక పరిజ్ణానం విస్తరిస్తున్న వేళ, ఇండియన్ కల్చర్, నైతిక విలువల ప్రాముఖ్యతను యువతకు తెలియజేయడమే లక్ష్యంగా ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న సదస్సుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, సీనియర్ నటి షబనాఅజ్మీ, మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వంటి వారు హాజరై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ వేదికగా రాష్ట్రీయస్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ యువతతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. ముంబై వేదికగా జరిగనున్న ఈ భేటీలో మోహన్ భగత్.. జెన్ జెడ్, ‘జెన్ ఆల్ఫా వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, యువతతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణం, భావి తరాల నాయకత్వం, ప్రపంచ శాంతి భారతదేశ పాత్ర వంటి కీలక విషయాలపై వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరుగుతున్న ఈ భారీ సదస్సును ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (ఐఐఎమ్‌యుఎన్ )అనే ఎన్జీవో నిర్వహిస్తున్నది. ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర , భారతీయ విధానం అనే అంశంపై మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత సంస్కృతి, జీవన విధానం ద్వారా ప్రపంచ శాంతికి ఎలా తోడ్పడవచ్చో ఆయన వివరిస్తారు. ఈ సదస్సుకు దేశంలోని వంద నగరాల నుంచి వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఐఐఎమ్‌యుఎన్ పదిహేనేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా యువతలో దేశభక్తి, నాయకత్వ ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భారత మూలాలు, సాంప్రదాయ విలువలను నవతరానికి పరిచయం చేయడమే తమ ఆశయమని ఐఐఎమ్‌యుఎన్ వ్యవస్థాపకుడు రిషబ్ షా పేర్కొన్నారు. దేశంలోని భిన్నమైన రాజకీయ, సామాజిక సిద్ధాంతాల పట్ల యువతకు నిష్పాక్షిక అవగాహన ఉండాలని, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని ఆలోచనా ధోరణులను అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ సదస్సు వేదికగా దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన బాధ్యత యువతపై ఉందనే సందేశాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అదలా ఉంటే.. ఐఐఎమ్‌యుఎన్ నిర్వహించే సదస్సులో మోహన్ భగవత్ పాల్గొనడం ఇది మూడోసారి. ఈ సదస్సుకు కేవలం ఆధ్యాత్మిక, సామాజిక రంగాల ప్రముఖులే కాకుండా చిత్ర పరిశ్రమ,కు చెందిన షబనా ఆజ్మీ, బోమన్ ఇరానీ, న్యాయవ్యవస్థకు చెందిన మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వంటి వారు కూడా హాజరౌతున్నారు. డిజిటల్ పరిజ్ఞానంతో ముందంజలో ఉన్న జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాలకు జాతీయ భావాలను, సామాజిక బాధ్యతలను తెలియజేయడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయని పరిశీలకులు అంటున్నారు. Mohan Bhagwat, Gen Z Gen Alpha, RSS Chief, IIMUN Mumbai, Nation Building, Indian Youth Summit
http://www.teluguone.com/news/content/mohan-bhagwat-36-228146.html





