వైసీపీ విమర్శలకు దీటుగా బదులిచ్చిన పీవీ సింధు.!

Publish Date:Aug 6, 2026

Advertisement

ఇండియన్ ఏస్ షట్లర్, తెలుగుతేజం, ఒలింపిక్  పతకాల  విజేత పి.వి. సింధు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వైసీపీయులకు గట్టి రిటార్డ్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు అందించి, వరుసగా 2 ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధుపై  వైసీపీ  సోషల్ మీడియా   ట్రోలింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తనపై వస్తున్న విమర్శలకు పీవీ సింధు ఘాటుగా సమాధానం ఇచ్చింది.  ఈ వివాదానికి ప్రధాన కారణం గత ప్రభుత్వాలు క్రీడాకారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు,  భూ కేటాయింపులపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారమే.  గతంలో ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో పి.వి. సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం కోసం రెండెకరాల స్థలం కేటాయించింది.

అంతే కాకుండా ఆమె సాధించిన ఒలింపిక్ విజయాలకు గుర్తుగా ఏపీ ప్రభుత్వం   30 లక్షల నగదు బహుమతి,  ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం,  2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమెను ఘనంగా సత్కరించాయి. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో  రాజకీయ సమీకరణల నేపధ్యంలో  వైసీపీ సోషల్ మీడియా సింధును లక్ష్యంగా చేసుకుని  ట్రోలింగ్ కు దిగింది. క్రీడల్లో దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన క్రీడాకారిణిని కేవలం రాజకీయ కోణంలో   ట్రోల్ చేయడంపై క్రీడాభిమానులు, సాధారణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

సింధు సైతం తాను  ఏ  పార్టీకి పరిమితం కాదని, భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నానని స్పష్టం చేశారు. క్రీడాకారుల కష్టాన్ని,  వారు సాధించిన అంతర్జాతీయ విజయాలను రాజకీయాలతో ముడిపెట్టడం   సరికాదని తేల్చిచెప్పారు. సైబర్ బుల్లీయింగ్,  సోషల్ మీడియా ట్రోలింగ్ అనేవి క్రీడాకారుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, ప్రతికూల వ్యాఖ్యలను అధిగమించి మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే తన నైజమని సింధు పేర్కొంది.  

 వైసీపీ సోషల్ మీడియా విశాఖలో  సింధు ఏర్పాటు చేయనున్న క్రీడా, విద్యా సంస్థకు రెండో సారి భూమి పూజ చేయడంపై విమర్శలు గుప్పిస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు పాల్పడ్డారు. దీనిపై సింధూ ఘాటుగా రిప్లై ఇస్తూ..  ఈ ప్రాజెక్టుకు మరోసారి భూమి పూజ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో భూమి పూజ కార్యక్రమాన్ని రెండు సారి నిర్వహించడానికి గల కారణాలను వివరిస్తూ సింధూ..   మొదటి భూమి పూజకు కేవలం ఏడు గంటల ముందు తనకు సమాచారం ఇచ్చారనీ, దీంతో అప్పుడు  తన కుటుంబం, సన్నిహితులు, తన విజయాలలో అండగా నిలిచిన  పలువురు హాజరు కాలేకపోయారనీ పేర్కొన్న సింధు,  వారందరి కోసం మరోసారి భూమి పూజ నిర్వహించాల్సి వచ్చిందని వివరించింది.

 అంతే కాకుండా మొదటి భూమి పూజ తరువాత  ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంతో  ఈ ప్రాజెక్టు బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి, సమగ్ర క్రీడా, విద్యా సంస్థగా విస్తరించిందని పేర్కొన్న సింధు..  ఈ విస్తరించిన ప్రాజెక్టుకు ఒక కొత్త ప్రారంభాన్ని ఈ రెండో సారి చేసిన భూమి పూజ ద్వారా వచ్చిందన్నారు.   సింధూ వివరణ పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమర్శకులకు గట్టిగా బదులిచ్చి వారి నోరు మూయించిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

PV Sindhu, YCP Trolls,  Sindhu Hits Back, Cyber Bullying, PV Sindhu Vizag Land, Badminton, Telugu One  

By
en-us Political News

  
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్‌ను, 70% మంది ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న కొత్త ఎఫ్‌డీ నిబంధనలు, వడ్డీ రేట్ల పారదర్శకత పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేసేలా పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన. కొత్త కార్లు, బైకుల బీమా గడువు పెంపుపై సమగ్ర కథనం.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో  వైసీపీ  కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.