పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. తీవ్ర ఉద్రిక్తతలు, బహిష్కరణ పిలుపుల మధ్య జరిగిన తొలి రెండు విడతల ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందే సమయానికి పీఎంఎల్-ఎన్ 34 స్థానాల్లో 24 స్థానాలను కైవసం చేసుకుని, దశాబ్దం తర్వాత పీవోకేలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమైంది.
శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిలుపును జనం ఖాతరు చేయలేదు. పీవోకే రాజధాని ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పీఎంఎల్ ఎన్, పీపీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ఈ నెల 10న జరగనుంది. మిగిలిన 11 స్థానాలకు పోలింగ్ ముగిసిన తర్వాత తుది ఫలితాలు వెలువడతాయి.
PMLN sweep in pok elections, Nawaz Sharif, Party, Awami. boycott
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pmln-sweep-in-pok-elections-36-228144.html
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
అదృష్టం అనేది ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటలీలో ఒక మహిళను వరించిన భారీ అదృష్టం క్షణాల్లో చేజారిపోయినట్లే కనిపించినా, చివరికి అనూహ్య రీతిలో ఆమె వద్దకే చేరింది.
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్ చెక్ పెట్టాయి.