బోనాల జాతరలో ‘షీ’ కన్ను.. 678 మందికి షాక్.. 25 మందికి జైలు..!
Publish Date:Aug 6, 2026
Advertisement
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్ చెక్ పెట్టాయి. పోలీసులే కనిపించడం లేదని ధీమాగా వ్యవహరించిన వారికి.. తమ మధ్యలోనే మఫ్టీలో షీ టీమ్స్ ఉన్నాయన్న విషయం ఆలస్యంగా తెలిసింది. అప్పటికే వారి చేష్టలు కెమెరాల్లో రికార్డయ్యాయి. బోనాల సందర్భంగా మహిళలను వేధిస్తూ ఆకతాయితనా నికి పాల్పడిన 678 మందిని షీ టీమ్స్ గుర్తించాయి. జనసం దోహంలో మహిళలను వెంబడించడం, అసభ్యం గా ప్రవర్తించడం, ఇబ్బం దులకు గురిచేయడం వంటి ఘటనలను షీ టీమ్స్ సిబ్బంది మఫ్టీలో నిశితంగా గమనించారు. అనుమానం వచ్చిన వెంటనే వీడియో ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నారు. షీ టీమ్స్ సేకరించిన వీడియో ఆధారాలతో పలువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆకతాయిలకు కోర్టు శిక్షలు విధించింది. 25 మందికి జైలుశిక్షతో పాటు జరిమానాలు పడగా.. మరో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.1,050 జరిమానా విధించారు. ఇక 26 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించడంతో పాటు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. పండుగ వేళ మహిళలకు భద్రత కల్పించేందుకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగి స్తున్నాయి. మఫ్టీలో ఉండటంతో తమను ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో ఆకతాయిలు చేసే ప్రతి కదలికను గమనిస్తున్నాయి. బోనాల జాతరలో భక్తి ముసుగులో ఆకతాయి తనం చేస్తే.. ‘షీ’ టీమ్స్ కెమెరా కంటికి చిక్కాల్సిందే.. కోర్టు మెట్లెక్కాల్సిందే..! Shes eye at the Bonala Jathara, She Teams, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/shes-eye-at-the-bonala-jathara-36-228178.html





