Publish Date:Jun 13, 2025
గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి . కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతోంది. తన మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసమో, కేసీఆర్‌ను ఇరికించడం ఇష్టం లేకో ఈటల రాజేందర్ .. అసలు తప్పే జరగలేని వాంగ్మూలం ఇచ్చారు. అన్నీ మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జరిగాయన్నారు.
మూడు బ్యారేజీలు కట్టాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులు. అందుకే ఆయన రియాక్ట్ అయి కౌంటర్ ఇచ్చారు, ఈటల వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ ఉపసంఘం.. మూడు బ్యారేజీలు నిర్మించాలని ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే.. మూడు ప్యారేజీల నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. అసలు కాళేశ్వరంకు కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదని, కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు ఓ లేఖ రాస్తానని ప్రకటించారు. అవసరమైతే వాంగ్మూలం కూడా ఇస్తానన్నారు.బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.
బీజేపీ ఎంపీగా ఈటల ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల ఉన్నారు. అటు రాజేందర్ ను కేసీఆర్ అవమానకరంగా.. కుట్రలు చేసి మరీ పార్టీ నుంచి బయటకు పంపారు. తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. పంతం పట్టి తన సొంత జిల్లా ఖమ్మంలో బీఆర్ఎస్‌కు స్థానం లేకుండా చేశారు. కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ కేసీఆర్‌ను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తుమ్మలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వక్తమవుతోంది. కాళేశ్వరం విషయంలో కర్త, కర్మ , క్రియ కేసీఆర్ అనేది బహిరంగరహస్యం. ఆయనే ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈటల ఆయన కోసం తుమ్మలకు బురద అంటించాలని చూడటం విమర్శల పాలవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-tummala-nageswara-rao-39-199872.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.