కృతజ్ణతా ప్రదర్శనను నిరసన ర్యాలీగా వక్రీకరించిన వైసీపీ.!

Publish Date:Jul 28, 2026

Advertisement

వైసీపీ ఫేక్ ప్రచారానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై  విష ప్రమారం చేస్తూ ప్రజలను తప్పదొవ పట్టించేలా అసత్య ప్రచారాలకు పాల్పడుతోందని మండిపడిన లోకేష్.. తాజాగా పెనమలూరులో  తల్లికి వందనం పథకాన్ని స్వాగతిస్తూ అంగన్ వాడీలు చేపట్టిన కృతజ్ణతా ర్యాలీని వైపీపీ ఎలా వక్రీకరించిందో.. వివరించారు.  వివరాల్లోకి వెడితే.. ఇటీవల రాష్ట్ర   మంత్రి నారా లోకేష్ పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంలో భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్ననను   వైసీపీ అనుకూల సోషల్ మీడియా,  మంత్రి లోకేష్ పర్యటనను నిరసిస్తూ అంగన్వాడీలు ఆందోళనకు దిగారంటూ వక్రీకరించాయి.  

దీనిపై  మంత్రి నారా లోకేష్  ఘాటుగా స్పందించారు. అసలు నిజాలను వెల్లడిస్తూ, వైకాపా ప్రచారంలోని డొల్ల తనాన్ని సాక్ష్యాధారా పెనమలూరులో అంగన్వాడీలు నిర్వహించినది నిరసన ర్యాలీ కాదనీ, అది కృతజ్ణతా ప్రదర్శన అని లోకేష్ స్పష్టం చేశారు.   వైకాపా హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందనీ, కనీసం  అమ్మఒడి పథకాన్ని కూడా వారికి వర్తింపజేయకుండా తీవ్ర అన్యాయం చేసిందనీ  గుర్తుచేశారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి   తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ  నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు  సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు. వాస్తవానికి అక్కడ జరిగింది కృతజ్ఞత సభ అని, కానీ దానిని నిరసనగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. 

బాబాయ్ పై  గొడ్డలిపోటును  గుండెపోటుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. అదే తీరులో ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చిన జనసందోహాన్ని, కృతజ్ఞతా ప్రదర్శనలను కూడా నిరసనలుగా మార్చి చూపించేందుకు  పాల్పడుతున్నదని విమర్శించారు.   నెట్టింట వైరల్ అవుతున్న ఫేక్ చిత్రాలను, అసలైన దృశ్యాలను పక్కపక్కనే ఉంచి ఆధారాలతో సహా వాస్తవాన్ని కళ్లకు కట్టారు. 

రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైకాపా శ్రేణులు కల్పిత వార్తలు, వక్రీకరించిన వీడియోలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నలోకేష్  ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే ఇటువంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు.  

 YSRCP Fake News, Penamaluru Anganwadi Rally, Thalliki Vandanam Scheme, AP Political News

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.