మిధున్ రెడ్డికి లేని ప్రాధాన్యత సిదిరి అప్పలరాజుకు ఎందుకు.. జగన్ తీరుపై వైసీపీలోనే అసంతృప్తి.!?

Publish Date:Jul 28, 2026

Advertisement

వైసీపీ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా  అంబోలు జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించాలని నిర్ణయించడం  రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో  కలకలం రేపుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదం కేసులో చట్టపరమైన విచారణ ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న అప్పలరాజుతో ములాఖత్‌కు పార్టీ అధ్యక్షుడు స్వయంగా వెళ్లడంపై వైసీపీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఇక పార్టీ శ్రేణుల్లో అయితే జగన్ నిర్ణయం పట్ల బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో  మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న ద్విచక్రవాహనం  ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు నిందితుడైన తన కుమారుడిని కాపాడేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు. ,

మరొక యువకుడిని ఈ కేసుఇరికించి దర్యాప్తును పక్కదోవ పట్టించేలా కుట్రపన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు. సిదిరి అప్పలరాజు ప్రస్తుతం   అంబోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  .  ఈ కేసు పూర్తిగా ఒక వ్యక్తిగత కుటుంబ వ్యవహారమని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదనీ వైసీపీ సీనియర్ నేతలు చెబుతూ.. ఈ కేసులో  అప్పలరాజుకు మద్దతుగా పార్టీ అధినేత స్వయంగా జైలుకు  వెళ్లి పరామర్శించడం సరికాదని అంటున్నారు.  

పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వివిధ వ్యవహారాల్లో కేసులు ఎదుర్కొని  రిమాండ్ ఖైదీలుగా ఉన్న సందర్భాలను గుర్తు చేస్తూ.. ఆయా సందర్భాలలో జైలుకు వెళ్లి ఆయా నేతలను పరామర్శించని జగన్.. ఒక ప్రైవేటు కేసులో అరెస్టైన మాజీ మంత్రిని పరామర్శించడానికి బయలుదేరడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  మద్యం కుంభకోణం కేసులో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  పలువురు ముఖ్య నాయకులు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు ఇతర జైళ్లలో రోజులకు రోజులు గడిపిన సమయంలో అధినేత పరామర్శకు వెళ్లలేదన్న అంశాన్ని గుర్తుచేస్తున్నారు.

పార్టీ కోసం, అధినాయకత్వం నిర్ణయాల కోసం నిలబడి జైలు పాలైన సీనియర్లను   పరామర్శించని జగన్, వ్యక్తిగత నిర్లక్ష్యం,  చట్ట ఉల్లంఘన నేరాలతో అరెస్టైన సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లడం.. తప్పుడు సంకేతాలను ఇస్తుందని అంటున్నారు.  ముఖ్యంగా యాక్సిడెంట్ చేసి.. సామాన్యుడి ప్రాణం తీసిన ఘటనలో  విచారణను తప్పుదోవ పట్టించారనే తీవ్రమైన ఆరోపణలు  ఎదుర్కొంటున్న నేతకు ప్రత్యక్ష మద్దతు తెలపడం వల్ల పార్టీ ప్రతిష్ఠ మసకబాదుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.     జగన్ ఈ ధోరణి..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

Seediri Appalaraju Arrest,  Srikakulam Ampolu Jail, YCP Internal Politics, TeluguOne 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.