డేట్‌.. టైమ్‌.. ప్లేస్‌ ఫిక్స్‌ చెయ్ జగన్‌.. చర్చకు నేను రెడీ : లోకేష్

Publish Date:Aug 28, 2026

Advertisement

 

ఏపీపీఎస్సీకి.. డీఎస్సీకి తేడా తెలియ‌ని అజ్ఞాని జ‌గ‌న్..! 

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు  పదోసారి సారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్ ఫిక్స్ చెయ్‌, పులివెందులకి అయినా, తాడేపల్లికి కొంపకు అయినా వస్తా, చర్చకు మీరు సిద్ధమా, డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు నాకు నీతులు చెబుతారా అని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు దేశం కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్ర‌వారం ఒంగోలులో జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ... డీఎస్సీపై 150 కేసులు వేయించినా, విజయవంతంగా పూర్తిచేసి టీచర్ ఉద్యోగాలు భర్తీచేశాం. అదీ మా చిత్తశుద్ధి. మీరు గతంలో  నిర్వహించిన గ్రూప్ -1 అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోందన్నారు.

బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఈ సంవత్సరమేకాదు, రాబోయే మూడేళ్లు కూడా డిఎస్సీ నిర్వహిస్తాం. జగన్ వాళ్ల తాత వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరు. గొడ్డలిపార్టీ అధ్యక్షుడు జగన్ కు నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశారు. ఆర్ అండ్ ప్యాకేజీ ఇచ్చి, పనులన్నీ పూర్తిచేస్తే క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏనాడైనా ఆయన నిజం చెప్పారా? అన్నగారి నుంచి చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసిఆర్ పరిపాలన చూశా. జగన్ లాంటి చేతగాని నాయకుడ్ని నేను ఇంతవరకు చూడలేదు. 

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి..!

త్వరలో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నికల‌కు కలిసికట్టుగా పనిచేస్తే సార్వత్రిక ఎన్నికలకంటే మరో 2శాతం మెజారిటీ ఓట్లతో ఘన విజయం సాధిస్తాం.  కార్యకర్తలు మా చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిర‌గండి, పదవులు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధి కార్యక్రమాలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. 4లక్షల మంది నాయకులను మై టిడిపి యాప్ ద్వారా మానిటర్ చేస్తున్నాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోండి. ఒంగోలు పోతురాజు కాల్వ, నల్లకాలువల అభివృద్ధికి వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అవి చేశాక ప్రాధాన్యత క్రమంలో మిగిలినవి ప‌నులు పూర్తి చేస్తాను. అభివృద్ధి, సంక్షేమం మన బాధ్యత. అయితే అది కేవలం పాస్ పోర్టు లాంటిది మాత్రమే. కార్యకర్తలంతా ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమవ్వండి. అదే మనకు శ్రీరామరక్ష. అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలకు దూరం అవుతారు. 

రాష్ట్రం గాడిన పడాలంటే మరో 3సార్లు గెలవాలి..

తెలుగుదేశం పార్టీది పెద్ద కుటుంబం, గత ఎన్నికల్లో జనసేన, బిజెపిలతో కలసి ప్రజల వద్దకు వెళ్లాం, 94శాతం సీట్లు గెలిచాం. మన ఐక్యత కొనసాగాలి. సిఎం, డిప్యూటీ సిఎం లకు క్లారిటీ ఉంది. కనీసం మరో మూడుసార్లు వరుసగా గెలిస్తేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలం. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుంది. ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, దొంగకేసులు పెట్టారు. నాపై 23కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్, ఎస్సీ, ఎస్టీ కేసులు, ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మాదిరి నేను కంచుకోటలో పోటీచేయలేదు. 40ఏళ్లలో గెలవని మంగళగిరిలో 91వేల మెజారిటీతో గెలిచా, అది నా సత్తా. 

జగన్ చేసిన తప్పులకు వైసీపీ నేతల బలి..!

జగన్ చేసిన తప్పుడు పనులకు కొందరు వైసీపీ నాయకులు ఈరోజు జైలుకు వెళ్తున్నారు, ఇప్పుడు కులం కార్డు తీస్తున్నారు. జగన్ సిఎం అయ్యాక బిసి సోదరులకు 10శాతం రిజర్వేషన్ తగ్గించి, 17వేలమంది బిసిలకు పదవులు రాకుండా అడ్డుకున్నారు. తమ అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా చంపేశారు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్యను కిరాతంగా హ‌త్య చేశారు. మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి, పరారయ్యాడు. తండ్రి కొడుకు బదులు మరొకరిని ప్రవేశపెట్టారు. చనిపోయిన నిరుపేద కుటుంబాన్ని కనీసం ఆదుకోలేదు. 

కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. లిక్క‌ర్ ర‌వాణాలో డబ్బులు కొట్టేశారు. అవినీతి సొమ్మును కోడలు ఎకౌంట్ లో డిపాజిట్ చేశారు. ఈడి గుర్తించింది. మధ్యలో పారిపోయారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు. ఐబి, సిబిఐ పట్టుకొచ్చారు. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం, మీరు చేసిన తప్పుల వల్లే జైలుకు వెళుతున్నారు. అధికారంలో ఉన్నపుడు కొల్లు, అచ్చెన్న, అయ్యన్నలపై తప్పుడు కేసులు బనాయించారు. ప్రస్తుత ఎంపి విజయ్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టుకు ప్రయత్నించారు. వైసిపి పాలనలో అరాచకాల‌ను ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది.

అహంకారం వద్దు...క‌లిసి ప‌నిచేయండి..!

పార్టీ నాయకులు, కార్యకర్తలకు అహంకారం వద్దు, కలసికట్టుగా పనిచేద్దాం. ఒంగోలులో అద్భుతమైన ఎమ్మెల్యే, ఎంపి ఉన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీమళ్లీ చంద్రబాబును సిఎంగా చేయాలి. చాలా కఠినమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. రూపాయికి 94పైసలు జీతాలకు సరిపోతోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏపీ నెంబ‌ర్ వ‌న్‌గా ఉండాలని చంద్రబాబు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు అని మంత్రి లోకేష్ తెలిపారు.  ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ... ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్ 2.0 పథకాన్ని చేపట్టాం. 

కార్పొరేషన్ కు తాజాగా రూ.78 కోట్లు మంజూరైంది, డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. డిజెఆర్ ట్రస్ట్ ద్వారా 6నుంచి 10వరకు 500మంది పేదపిల్లలను చదివిస్తున్నామని అన్నారు.  ఈ స‌మావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకట్రాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు జడ్ శివప్రసాద్, ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

 

Minister Nara Lokesh, Tour of the Ongoles,  TDP, CM Chandrababu, Mega DSC, Telugu news, Telugu One, MLA Damacherla Janardhan, APPSC


 

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.