సిఎం గాలి వాగ్థానాలు

Publish Date:Aug 27, 2012

Advertisement

ముఖ్యమంత్రి జిల్లాల్లో ఇందిరమ్మ బాట ద్వారా ఎస్‌సి, ఎస్టీ హాస్టల్స్‌లో నిద్రించినా విద్యార్ధుల వెతలు తీరలేదు. హాస్టళ్లలో మెరుగైన వసతులు నాణ్యమైన ఆహారం అందించి ఉత్తమ విద్యార్దులను అందిస్తామని అదికారులు, నాయకులు చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఒక్కో విద్యార్ధికీ 1 నుండి 7 తరగతి వరకూ ఇచ్చేది కేవలం 15 రూపాయలు, 7 నుండి 10 తరగతి విద్యార్దులకు 17 రూపాయలు. దీంతో మెనూ ప్రకారం మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు పండ్లు, ఒక రోజు స్వీటు ఇవ్వటానికి కుదరటం లేదని వార్డెన్లు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం వారాల వారీగా పులిహోర, కిచిడి, ఉప్మా, వైట్‌రైస్‌, మద్యాహ్నం రాత్రికి పప్పు, కూరగాయలతో భోజనం వడ్డించడానికి కుదరటం లేదని వార్డెన్లు చెబుతున్నారు. హాస్టళ్లు మొదలై మూడు నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటివరకూ వైద్య శిబిరాల ఊసే లేదు. దాంతో పిల్లలంతా రోగాల భారిన పడుతున్నారు. హాస్టళ్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నాయి. అదే విధంగాహాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు ఈనెల 8న అధికారులు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా ఆలస్యంగా టెండర్ల ప్రక్రియ ముగించారు. దాంతో వార్డెన్లు ఇతర కిరాణా దుకాణాల నుండి సరుకులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అలాగే హాస్టల్‌లో వుండే బాలికలకు నూనె, సబ్బులు, వగైరాలకోసం నెలకు 75 రూపాయలు, బాలురకు 50 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఏడాదిలో జూన్‌ నెలలో ఒక్కో విద్యార్ధికీ కేవలం 35 రూపాయలు ఇచ్చారు. జూలై, ఆగస్టు నెలల బిల్లులు ఇవ్వవలసి ఉందని విద్యార్దులు తెలియచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్‌ చార్జీలను పెంచాలని, అలాగే నెలనెలా బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.