పులివెందుల దాహార్తికి శాశ్వత పరిష్కారం మెగా వాటర్ గ్రిడ్.!

Publish Date:Aug 25, 2026

Advertisement

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. వైఎస్ మరణానంతరం ఈ నియోజకవర్గం వైఎస్ తనయుడు, వైసీపీ అధినేత జగన్ కు పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. అయితే అటువంటి కంచుకోటకు 2024 ఎన్నికలలో బీటలు వారాయి. 2019 ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 91 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్.. 2024 ఎన్నికలో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు.

 2024 ఎన్నికలలో జగన్ మెజారిటీ దాదాపు 30 వేలు తగ్గింది.  ఆ తరువాత   పులివెందుల జెడ్పీటీసీకి జరిగినఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అదీ అలాంటిలాంటి మెజారిటీతో కాదు.. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం ఆరు వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో గెలుచుకుంది.   ఎన్నడూ లేని విధంగా జగన్ కోట అయిన పులివెందులలో ఆయనకు తగ్గుతున్న ఆదరణ.. ఆ కోటకు బీటలు వారడాన్ని ప్రస్ఫుటంగా చూపింది. 

ఇక ఇప్పుడు ఆ కోటలో పాగా వేసే దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే..  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ప్రశంసలనూ అందుకుంటోంది. ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం అనేవి  కేవలం రాజకీయ ప్రయోజనాలు,  లబ్ధి కోసమే కాదనీ, అది ప్రజల పట్ల ప్రభుత్వాలకూ నేతలకూ ఉన్న బాధ్యతకు దర్పణమనీ పవన్ చాటారు.

ఎలాగంటే..  జల్ జీవన్ మిషన్-అమరావాణి వాటర్‌షెడ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కడప జిల్లా పరిధిలో మంచినీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెడుతున్న పవన్ కళ్యాణ్..    వైసిపి  హయాంలో ప్రతిపాదించి, ఆపై రకరకాల కారణాలతో నిర్లక్ష్యానికి గురైన  అభివృద్ధి పథకాలపై ఆయన ప్రత్యేక చూపుతున్నారు. అందులో భాగంగానే  పులివెందుల నియోజకవర్గం, దాని పరిసర ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న   తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా   మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులను వేగవంతం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పని చేసిన జగన్ తన హయాంలో సొంత నియోజకవర్గమైన పులివెందుల తాగునీటి సమస్య పరిష్కారంలో ఘోరంగా విఫలమైతే..ప్రత్యర్థి పార్టీకి కంచుకోట అయినప్పటికీ పులివెందుల ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం.. పవన్ కల్యాణ్ నడుంబిగించారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా పులివెందుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సీమలో నీటి కరవు పూర్తిగా తీరుస్తాం అని ప్రకటించిన చంద్రబాబు ఆశయ సాధన దిశగా పవన్ కల్యాణ్  వాటర్ గ్రిడ్ పథకాన్ని పరుగులు పెట్టిస్తుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Mega Water Grid for Pulivendula, Pawan Kalyan,, AP Deputy CM, Jal Jeevan Mission, YSR Kadapa Water  

By
en-us Political News

  
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో  తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో  తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ   టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను  ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక  కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.  
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో  తీవ్రంగా గాయపడిన  బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.  
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.  
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు   110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో  వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావం  దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.