మేలో సహకార సంఘాల ఎన్నికలు?
Publish Date:Apr 3, 2012
Advertisement
గ్రామీణ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా సహకార సంఘాల ఎన్నికలు మేలో జరగచ్చని తెలుస్తోంది. సహకార సంఘాల పదవీకాలం గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. పొడిగించిన గడువు కూడా వచ్చేనెల 23తో ముగుస్తుంది. అందుకే ఈలోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మేలో ఎన్నికలు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏడాదిన్నర క్రితం సహకార సంఘాల సభ్యుల పదవీకాలం ముగియడంతో ఇప్పటికే మూడు విడతలుగా వారినే కొనసాగిస్తూ పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. మరోసారి పొడిగించకుండా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ జూన్ లోగా పూర్తవుతుంది.
http://www.teluguone.com/news/content/may-bypoll-elections-24-13124.html





