ఫిలింనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..సెల్లార్‌లో పార్క్ చేసిన ఆరు కార్లు దగ్ధం..!

Publish Date:Aug 30, 2026

Advertisement

 

హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హుడా ఎన్‌క్లేవ్‌, జర్నలిస్టు కాలనీలోని ఓ నివాస భవనం సెల్లార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో మొత్తం ఆరు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో స్థానికంగా కొద్దిసేపు తీవ్ర భయాందోళన నెలకొంది. సెల్లార్‌ నుంచి మంటలు, దట్టమైన పొగ వెలువడటాన్ని గమనిం చిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, అన్నపూర్ణ స్టూడియో అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్‌ టెండర్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అంచనా వేసి వెంటనే మంటలను అదుపులోకి తీసుకు రావడానికి చర్యలు చేపట్టారు. 

అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో నివాస భవనంలో 15 మంది ఉన్నట్లు ఫైర్‌ సిబ్బంది గుర్తించారు. సెల్లార్‌లో మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే భవనంలోకి వెళ్లి అక్కడ ఉన్న 15 మందిని సురక్షి తంగా బయటకు తీసుకు వచ్చారు. మరోవైపు సెల్లార్‌ లో మంటలు మరింత విస్తరించకుండా ఫైర్‌ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు. పలువైపుల నుంచి నీటిని ప్రయోగిస్తూ మంటలను అదుపులోకి తీసుకువ చ్చారు. కొంతసేపు శ్రమించిన అనంతరం మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అనంతరం సెల్లార్‌లో ఎక్కడైనా మంటలు, పొగ మిగిలి ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించారు.

ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం  సంభవించలేదు. అయితే సెల్లార్‌లో పార్క్ చేసిన ఆరు కార్లు మంటల్లో పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తిన ష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం సమయంలో భవనంలో ఉన్న 15 మందిని సకాలంలో గుర్తించి సురక్షితంగా బయటకు తరలించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించి వేగంగా సహాయక చర్యలు చేపట్టడంతో మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించ కుండా నియంత్రించగలిగారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. సెల్లార్‌లో వాహనాల పార్కింగ్‌ ప్రాంతం కావడంతో షార్ట్‌ సర్క్యూట్‌ లేదా ఇతర కారణాలతో మంటలు చెలరేగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో చోటుచేసు కున్న ఈ ఘటనతో హుడా ఎన్‌క్లేవ్‌, జర్నలిస్టు కాలనీలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఫైర్‌ సిబ్బంది సమర్థవంతంగా స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

 

Major fire in Filmnagar, Journalist Colony, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand,  Telugu News, Telugu One

By
en-us Political News

  
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.