Publish Date:Apr 25, 2012
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జూన్ లో రాజకీయపార్టీగా అవతరించబోతోంది. జూన్ ఐదో తేదీ తరువాత పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందా కృష్ణ మాదిగ "తెలుగువన్.కామ్''కు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు బడుగు, బలహీనవర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబసభ్యులకు, తమ సామాజికవర్గానికి లక్షల కోట్లు దోచిపెట్టారన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కోట్లు ఆర్జించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమలుగా విడదీసి మూడు ప్రత్యేక రాష్త్రాలు ఏర్పాటు చేయాలని అప్పుడే ఈ మూడు ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రావాడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెనక్కి రప్పిస్తామన్నారు. ఏయే శాఖలు ఈ నిధులు బదిలీ అయ్యాయో వాటినుంచి వడ్డీతో సహా రప్పించి వాటిని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కోరుకునే ప్రతి ఒక్కరూ తాము ఏర్పాటు చేయబోయే పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సమర్థుడని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అధికారాన్ని కాపాడుకోవడం కోసమే పని చేస్తున్నారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర మంత్రులతో సంప్రదించారనీ, కానీ ఈ విషయమై ఎన్నిసార్లు కలిసినా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించటం లేదని ఆయన ఆరోపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madiga-reservation-samithi-turns-political-party-24-13622.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు