దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు: ప్రయాణీకులు క్షేమం.!
Publish Date:Nov 10, 2026
Advertisement
ప్రకాశం జిల్లాలో తృటిలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, బస్సును నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దించేయడంతో ప్రాణనష్టం తప్పింది. వలేటివారిపాలెం మండలం చుండి సమీపంలో సోమవారం (నంబర్ 9) అర్థరాత్రిఅర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కడప నుంచి విజయవాడ 33 మంది ప్రయాణీకులతో వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చుండి వద్దకు రాగానే బస్సు ముందు టైరు బరస్ట్ అయ్యింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. టైరు పేలిన వెంటనే మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులను అప్రమత్తం చేసి అందరినీ హుటాహుటిన బస్సు నుంచి కిందకు దించేశారు. దీంతో ప్రయాణీకులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇది కూడా చదవండి: మంటల్లో కాలి దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బస్సులోంచి ప్రయాణీకులంతా దిగిన తరువాత చూస్తుండగానే బస్సంతా మంటలు వ్యాపించాయి. కొద్ది సేపటికే బస్సు పూర్తిగా దగ్థమైంది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్లే పెను విషాదం తప్పిందని ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టైరు పేలడం వల్లనే మంటలు వ్యాపించాయనీ, క్షణాల్లో అవి బస్సు ఆయిల్ ట్యాంకర్ కు అంటుకుని మంటల తీవ్రత పెరిగి బస్సు మొత్తం దగ్ధమైందని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మీకు నచ్చవచ్చు: ఆర్టీసీ బస్సులో మంటలు...కిటికీల్లోంచి దూకిన ప్రయాణికులు మంటల్లో కాలి దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు [Fire Private Travels Bus, Prakasham, Districts, Driver, Alert, Avert, Deaths, Telugu One]
http://www.teluguone.com/news/content/fire-private-travels-bus-43-236697.html





