హత్య కేసులో జీవిత ఖైదీకి బెస్ట్ టీచర్ అవార్డు.. అసలెంజరిగిందో తెలుసా.!

Publish Date:Aug 29, 2026

Advertisement

ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఖైదీ.. బెస్ట్ టీచర్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? జైల్లో సత్ప్రవర్తనతో తోటి ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పడం వల్ల ఆ పురస్కారం లభించిందనుకుంటున్నారా? కాదు కాదు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి పెరోల్ పై బయటకువచ్చి పరారైపోయాడు. నాలుగు దశాబ్దాలుగా పోలీసుల కన్నుగప్పి అజ్జాతంలో ఉంటూనే.. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి.. ఏకంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్నారు. నమ్మశక్యంగా లేకున్నా ఇది పచ్చి నిజం.   ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సందెల వీరన్న అనే వ్యక్తి ఒక హత్య కేసులో కోర్టు జీవిత ఖైది విధించింది. దీంతో అధికారులు జైలుకు తరలించారు. ఆరు నెలలలో  అంటే 1983 డిసెంబర్ లో వీరన్న నిబంధనల ప్రకారం 30 రోజుల పరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చాడు.

పరోల్ పై బయటకు వచ్చిన తర్వాత,   చట్టపరమైన అవకాశాలను వాడుకుంటూ ఆ కాలాన్ని 1984 మార్చి వరకు పొడిగించుకుంటూ వచ్చాడు.  పరోల్ ఉత్తర్వుల ప్రకారం, 1984 మార్చి 18న  తిరిగి సంబంధిత జైలు అధికారుల ఎదుట హాజరై లొంగిపోవాల్సి ఉంది. కానీ.. ఆ గడువు ముగిసినా  వీరన్న  జైలు ముఖం చూడలేదు. పరారయ్యాడు. ఆ పరారీ పర్వం ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు కొనసాగింది.  

పరారైన వీరన్న, చ తన పేరు, చిరునామా, పాత పరిచయాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మరో ప్రదేశానికి వెళ్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడయ్యాడు.   నిబద్ధత కలిగిన టీచర్‌గా నటిస్తూ, విద్యార్థులకు పాఠాలు చెబుతూ  పేరుప్రతిష్టలు సంపాదించుకున్నాడు. విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను అతనికి  బెస్ట్ టీచర్  పురస్కారం కూడా లభించింది. 

ఒక వైపు ఖైదీల రికార్డుల్లో అతడు పరారీలో ఉన్న నేరస్థుడిగా కొనసాగుతుండగా, మరొక వైపు ప్రభుత్వ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా జీతం పొందుతూ, అవార్డులు అందుకుంటూ సమాజంలో చెలామణి కావడం విశేషం.  

ఎట్టకేలకు విషయం బయటపడి కటకటాల పాలయ్యాడు. అయితే.. నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  

{Life  Prisioner Best Teacher Awardww, Sandela Veeranna, Warangal murder case, absconding, Parole, Best Teacher Award, crime news, Telugu One}

By
en-us Political News

  
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 
హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది.
హానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.
సిగరెట్‌ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి   శుభాకాం క్షలు తెలిపారు.  అలాగే మంత్రి సోదరులు   అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు.  గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.