బుద్ధవనాన్ని సందర్శించండి.. ఫిలడెల్ఫియా బౌద్ధాచార్యులకు ఆహ్వానం.!
Publish Date:Aug 29, 2026
Advertisement
తెలంగాణలో నాగార్జునసాగర్ వద్ద పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, బుద్ధ వనాన్ని సందర్శించవలసిందిగా ఫిలడెల్ఫియా నగరంలోని బౌద్ధాచార్యులకు ప్లీచ్ ఇండియా సీఈవో, బౌద్ధ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆహ్వానించారు. స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో ఆయన అమెరికా ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు. వాట్ ఖ్మేర్ పలెలై, ఫ్ర బుద్ధ రన్సీ, కతంప ధ్యాన కేంద్రం, లియాన్ షెంగ్ ట్రూ బుద్ధ టెంపుల్, వొన్ బౌద్ధాలయాలను కూడా ఆయన న సందర్శించి, ఆయా బౌద్ధాలయ ఆచార్యులకు నాగార్జునకొండ, బుద్ధవనం, అలాగే.. తెలంగాణలోని ప్రసిద్ధ బౌద్ధారామాల ప్రత్యేకతలను వివరించారు. శివనాగిరెడ్డి ఆహ్వానం మేరకు వారు తమ భారత పర్యటనలో భాగంగా తెలగాణలోని బుద్ధవనాన్ని సందర్శనకు అంగీకరించారు. {Visit Boudha Vanam, Pleach India, Ceo. Emani, Invite, Pheladelphia Buddhists}
http://www.teluguone.com/news/content/visit-boudha-vanam-24-230188.html





