Publish Date:Nov 15, 2025
కేసీఆర్ రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ స్వీకరించిన తరువాత జూబ్లీ ఉప ఎన్నిక పరాజయంతో కేటీఆర్ వరుస వైఫల్యాలలో హ్యాట్రిక్ సాధించినట్లైంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరమై, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపాదడపా.. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడినా, వారికి రాజకీయ దిశానిర్దేశం చేసినా గత రెండేళ్లుగా ఆయన తీరు చూస్తుంటే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అనిపించక మానదు.
సరే అది పక్కన పెడితే.. తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఔను.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ కేసీఆర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి తాను క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటించారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బాధ్యతలన్నీ కేసీఆర్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో స్కోర్ చేసింది. ఆ తరువాత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పరాజయం పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాజయాలలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు పరాజయాలూ కేటీఆర్ ఖాతాలోనే పడ్డాయి.
పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అటువంటిది ఇప్పుడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలతో సత్తా చాటింది. దీంతో పార్టీ క్యాడర్ లో కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని సడిలేలా చేశాయి ఈ పరాజయాలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-complete-hattric-in-defeats-39-209588.html
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.