కేంద్ర కేబినెట్ లోకి దగ్గుబాటి పురంధేశ్వరి.. విద్యాశాఖ అప్పగించనున్న మోడీ?

Publish Date:Jul 27, 2026

Advertisement

నీటి పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వరంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్రమోడీ. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు అనివార్యంగా ధర్మేంద్రప్రధాన్ చేత రాజీనామా చేయిం,చాల్సిన పరిస్థితి ఎదురుర కావడం మోడీ ప్రతిష్ట మసకబారడానికి కారణమైంది. 

కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా  విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే విద్యావ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులే ఉవ్వెత్తున ఉద్యమించారు. అదలా ఉంచితే.. నరేంద్ర మోడీ తాత్కాలికంగా జోషీకి విద్యాశాఖ అప్పగించారనీ, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ బాధ్యతలు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి అప్పగించే అవవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఢిల్లీ వర్గాల సమాచారం.  గతంలో క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండంతో ప్రధాని మోడీ ఆమెవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. 

నీట్   లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట బాగా మసకబారిందనడంలో సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. దీంతో ప్రధాని మోడీ నష్టనివారణపై దృష్టి పెట్టారంటున్నారు.  ఇప్పటికే మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని విద్యాశాఖను విద్యావంతురాలు, రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి  సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు బీజేపీలో చేరిన పురంధేశ్వరి..ఆ ఎన్నికలలో  రాజంపేట నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోఆమె రాజమహేందర వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగించాలని మోడీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  

Daggubati Purandeswari into union cabinet, Union Education Minister, Dharmendra Pradhan resignation, Rajahmundry MP, Modi Cabinet expansion 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.