జూబ్లీలో ఓటమిని కేసీఆర్ ముందే ఊహించారా?

Publish Date:Nov 15, 2025

Advertisement

బీఆర్ఎస్ చావో రేవో అన్నట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్ ఉప ఎన్నికలో అనూహ్యంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  కాంగ్రెస్ కు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఇక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అయితే కంటోన్మెంట్ పరాజయంతో పోలిస్తే ఈ పరాజయం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.

పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా అలానే అనుకుంది. అయితే కేసీఆర్ మాత్రం గడపదాటి బయటకు రాలేదు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం చేయలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత.. కేసీఆర్ జూబ్లీ ఓటమిని ముందే ఊహించారా? అన్న చర్చ మొదలైంది.  

జూబ్లీ హిల్స్ లో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్నది అర్ధం అయ్యింది కనుకనే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటూ ఓడిపోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అనవసరమని ఆయన భావించి ఉంటారని  అంటున్నారు. తాను ప్రచారం చేసిన తరువాత కూడా పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతే అది గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం కంటే ఎక్కువ అవమానకరమని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు.  జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడంతో  పార్టీ క్యాడర్ కూడా ఇదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. 

By
en-us Political News

  
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.