తెలంగాణ క్రీడాభివృద్ధికి ఖేలో ఇండియా వేదికగా బలమైన పునాది: సీఎం రేవంత్

Publish Date:Nov 25, 2026

Advertisement

తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు తొలిసారిగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG) 2026 క్రీడా రంగానికి బలమైన పునాదిగా నిలవనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పోటీల కోసం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా.. భావితరాలకు ఉపయోగపడేలా శాశ్వత క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖేలో ఇండియా పోటీల నిర్వహణ, ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రూ.21 కోట్లు కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.120 కోట్లతో స్టేడియాల అభివృద్ధి, ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక క్రీడా పరికరాలను సమకూరుస్తున్నారు.

2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన జాతీయ క్రీడల తర్వాత తెలంగాణలో ఈ స్థాయిలో భారీ క్రీడా పోటీలు జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో సుమారు 8 వేల మంది క్రీడాకారులు, అధికారులు పాల్గొనగా.. ఈసారి ఖేలో ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా 9 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో క్రీడా వాతావరణాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.

డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవం, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నగరమంతా క్రీడా స్ఫూర్తి కనిపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేడియాల పునరుద్ధరణ, క్రీడా వేదికల అభివృద్ధిలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పనుల నాణ్యతపై విజిలెన్స్ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్రీడా వేదికల్లో టాయిలెట్లతో సహా నిర్వహణ అవసరాలన్నింటికీ ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచించారు.

ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఒక్కో విభాగానికి ప్రత్యేక ఇన్‌ఛార్జులను నియమించాలని సీఎం ఆదేశించారు. ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని సూచించారు. జిల్లాలవారీగా మంత్రులను ఇన్‌ఛార్జులుగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో సమన్వయం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. మహబూబ్‌నగర్‌కు జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మానికి తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌కు సుదర్శన్‌రెడ్డిని పర్యవేక్షణ బాధ్యతల్లో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. పోలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ఇది కూడ చవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.!

ఇప్పటికే 14 స్టేడియాల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఆరు స్టేడియాల్లో ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మొత్తం 27 క్రీడలకు అవసరమైన పరికరాలను కూడా అప్పటిలోగా సిద్ధం చేయనున్నట్లు వివరించారు. పనుల పురోగతిపై ప్రతి రోజు నోడల్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు 27 క్రీడలకు సంబంధించి 1,334 మంది తెలంగాణ క్రీడాకారులకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం తరఫున పోటీల్లో పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. వీటిలో రెండు జతల ట్రాక్ సూట్లు, టీషర్టులు, షార్టులు, స్పోర్ట్స్ షూ, సాక్సులు, లోదుస్తులు, ట్రైనింగ్ టీషర్టులు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి, వారికి అత్యుత్తమ శిక్షణ అందించేందుకు దేశంలోనే పేరొందిన కోచ్‌లను నియమించాలని సీఎం సూచించారు.

ఈసారి ఖేలో ఇండియాలో తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ కర్రసామును ప్రదర్శన క్రీడగా ప్రవేశపెట్టనున్నారు. జాతీయ స్థాయిలో ఈ సంప్రదాయ కళకు గుర్తింపు తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో దానికి మరింత ప్రోత్సాహం లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

కేవలం ఖేలో ఇండియా పోటీల నిర్వహణతోనే సరిపెట్టకుండా.. రాష్ట్రంలో దీర్ఘకాలిక క్రీడాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. స్టేడియాల ఆధునీకరణ, క్రీడా అకాడమీలు, మినీ స్టేడియాల నిర్మాణంతో పాటు కొత్త క్రీడా విధానాన్ని అమలు చేస్తోంది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే స్థాయిలో తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది.

ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా శిక్షణ, క్రీడా విద్య, స్పోర్ట్స్ సైన్స్ అందించేందుకు హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఏర్పాటు చేసింది. దక్షిణ కొరియాకు చెందిన కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా ఖేలో ఇండియా పోటీలను రాష్ట్ర క్రీడా రంగానికి తాత్కాలిక వేడుకగా కాకుండా.. భవిష్యత్తు క్రీడా ప్రస్థానానికి పునాదిగా మలచాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

మీకు నచ్చవచ్చు: మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో..తొలి వివాహితగా చరిత్ర.!

మీకు నచ్చవచ్చు: 10 లక్షల మంది కార్యకర్తలతో మైటీడీపీ రికార్డు.. నారా లోకేశ్ డిజిటల్ వ్యూహం.!
 


[ Khelo India Youth Games 2026, CM Revanth Reddy, Telangana Sports Development, Vakiti Srihari, Khelo India Telangana, Hyderabad Sports Infrastructure, LB Stadium, Gachibowli Stadium ]

By
en-us Political News

  
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది.
అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. 
విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌.!
మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ సాధారణ దుకాణం వేలంలో ఊహించని అద్దె పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.