ఈ నెల 26న కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.!

Publish Date:Nov 24, 2026

Advertisement

తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు చీరలను కానుకగా అందించనున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది. 

ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు కలిపి మొత్తం కోటి చీరలను అందించనుంది. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు.

ఇందులో 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ చీరలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులతోనే తయారు చేయించారు. మహిళలకు చీరలను కానుకగా అందించడంతో పాటు, స్థానిక నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ చీరలు పొందేందుకు అర్హులు. 

జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం జరగనుంది.గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు.

మీకు నచ్చవచ్చు: అటెండర్ మృతి.. KCR తీవ్ర విచారం.!

మీకు నచ్చవచ్చు: కార్తిక పౌర్ణమి: కిటకిటలాడుతున్న శివాలయాలు: తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ.!

 

[ Indiramma Sarees, Telangana Government, CM Revanth Reddy, Indiramma Mahila Shakti, One Crore Sarees, One Crore Women, Saree Distribution, Achampet, Nagarkurnool, Telangana Women, Free Sarees Scheme ]

By
en-us Political News

  
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది.
అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. 
విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌.!
మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ సాధారణ దుకాణం వేలంలో ఊహించని అద్దె పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.