హైదరాబాద్ లో పేలుళ్లు: బెదరింపు ఈ మెయిల్ తో పోలీసులు అలర్ట్.!

Publish Date:Nov 23, 2026

Advertisement

హైదరాబాద్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్ అందడం  కలకలం రేపింది. ముంబై  26/11 ఉగ్రదాడి తరహాలోనే  పేలుళ్లకు పాల్పడతామన్నది ఆ బెదరింపు ఈ మెయిల్ సారాంశం. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా, నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.    కాచిగూడ రైల్వే స్టేషన్‌, హోటల్ టూరిస్ట్ ప్లాజా సహా భాగ్యనగరంలోని పలు ప్రముఖ ప్రాంతాలలో పేలుళ్లు జరుపుతామన్నది ఆ ఈమెయిల్ లో హెచ్చరించారు. 

 లష్కరేతోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, టాప్ కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడతామని ఆ ఈమెయిల్ లో పేర్కొన్న నేపథ్యంలో... పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది.  లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనిని పంపిన వారు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.   బెదిరింపు సందేశం ప్రామాణికత, దాని వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించడంపై దృష్టి సారించారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు,  ప్రజలు అధికంగా సంచరించే  ప్రదేశాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన వస్తువులు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు సిబ్బందికి ఆదేశాల్లో స్పష్టం చేశారు. అలాగే ఇతర భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నగరంలో భద్రతా పరమైన అప్రమత్తతను కొనసాగిస్తూనే తనిఖీలను వేగవంతం చేశారు.

ఇది కూడా చదవండి:  లుఫ్తాన్సా ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్​

 బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెయిల్ పంపించింది ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది? అన్న వివరాలపై దృష్టి సారించారు.  మెయిల్ మూలాలు నిర్ధారణ అయితే ఆ ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 

మరోవైపు.. నగరంలో  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. 

మీకు నచ్చవచ్చ: టాయిలెట్‌లో ఓ కాగితం..గాల్లోనే ప్రయాణికులకు బాంబు టెన్షన్.!​

పేలుళ్ళకు వాడిన బాంబులు ఇక్కడ చేసినవె

[Bombthreat, Email, Hyderabad, Police, HIAlert, TeluguOne]

By
en-us Political News

  
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది.
విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌.!
మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ సాధారణ దుకాణం వేలంలో ఊహించని అద్దె పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.