అటెండర్ మృతి.. KCR తీవ్ర విచారం.!
Publish Date:Nov 24, 2026
Advertisement
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు మరో యువకుడు కూడా మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ముస్తాబాద్ మండలం బందనకల్ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా, వెంకయ్యకుంట వద్ద రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భరత్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భరత్ కూడా మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. తన వద్ద నిబద్ధతతో పనిచేస్తున్న మణికుమార్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మణికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మణికుమార్ రెడ్డి మృతిపట్ల కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, మాజీ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మణి తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారని, ఆయన అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇది కూడ చదవండి: విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం.! మరోవైపు, రాత్రి వేళల్లో వేగంగా దూసుకొచ్చే భారీ వాహనాల కారణంగా జిల్లాలో ప్రమాదాలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీకు నచ్చవచ్చు: ఫేస్ క్రీమ్ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.! మీకు నచ్చవచ్చు: కార్తిక పౌర్ణమి: కిటకిటలాడుతున్న శివాలయాలు: తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ.! [ KCR attendant dies, KCR Family, Manikumar Reddy, Kasturi Mahender Reddy, BRS, KTR, Shobha, Rajanna Sircilla, Mustabad Road Accident, Sand Lorry Accident ]
మణికుమార్ రెడ్డి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ముస్తాబాద్ మాజీ జడ్పీటీసీ శరత్‌రావుకు కేసీఆర్ సూచించారు.
http://www.teluguone.com/news/content/-kcr-attendant-dies-24-237837.html





