ఒకసారి వెళ్ళారు ... మళ్ళీ తాను కాంగ్రెస్ వాడినని తిరిగి వచ్చారు. తన కుటుంబచరిత్ర అంతా కాంగ్రెస్ తోనే ముడిపడి ఉందని బోలెడు కబుర్లు చెప్పారు, ఇంతకీ ఎవరనుకుంటున్నారు ...? అదే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మళ్ళీ కాంగ్రెస్ గడపను రెండోసారి దాటేశారు. ఆయన కాంగ్రెస్ లోనే ఉన్న జగన్ కోవర్టు అని చెప్పకతప్పదు. తన అన్న ద్వారంపూడి వీరభద్రారెడ్డిని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేర్చి తనకు ఆహ్వానం పలికించుకుని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని ఆయన భావించారు. కానీ జగన్ అరెస్టు కావటం, విజయమ్మ పార్టీ బాధ్యతలు తీసుకోవటంతో జగన్ వైపు తిరిగి చేరిపోయారు. అయితే వాస్తవానికి వ్యాపార వ్యవహారాల్లో బాగా దెబ్బతిన్న ద్వారంపూడిని జగన్ ఆదుకుని పైకి తీసుకువచ్చారని నగరంలో చెప్పుకుంటున్నారు. అందువల్ల ఆయన ఏ పార్టీలో ఉన్నా జగన్ మనిషని తూర్పుగోదావరి జిలా అంతా తెలుసు. ఆయన కాంగ్రెస్ వాడిగా నటించినప్పటికీ కార్యకర్తలు కూడా ద్వారంపూడిని నమ్మలేదు. ఇప్పుడు నేరుగా తన పదవికి రాజీనామా చేసి జగన్ పంచన చేరి తన విశ్వాసాన్ని చాటుకుంటున్నారు. అయితే ద్వారంపూడి ఏ పనులూ చేయని ఎమ్మెల్యేగానూ, తన కులానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగానూ గుర్తింపునందుకున్నారు. తరువాత ఈయన రాజకీయజీవితంపై ఈ రెండు అంశాల ప్రభావం ఉంటుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kakinada-mla-dwarampudi-24-14525.html
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.