ఎవరి మీదైనా చర్య తీసుకోవాలంటే వెనుకాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు వచ్చింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమంటూ ... షోకాజ్ నోటీసులు ఇస్తామంటూనే రోజులు గడిపేస్తారు. దీంతో ఆ పార్టీ ఏమీ చేయలేని, చేతకాని పార్టీ అని అందరూ విమర్శించటానికి అవకాశం లభిస్తోంది. ఇటీవల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి సిబీఐ ఎదుట తొలిరోజు హాజరైనప్పుడు ఆయన వెంట ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఉన్నారు. ఆయన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా జగన్ వెనుకే ఉంటానని ఖచ్చితంగా చెప్పేశారు. దీంతో పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ క్రమశిక్షణా సంఘ చైర్మన్ తో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆళ్ళ నానికి షోకాజ్ నోటీసు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ తరువాత ఒక్క ఎమ్మెల్యేను కూడా వాడులుకోలేమన్నట్లు మౌనం వహించారు. పర్యావసానంగా ఆళ్ళ నాని ఆ తరువాత బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి కూడా పార్టీని వదిలేస్తున్నారు. అనుకున్నట్లుగా ఆళ్ళ నానికి నోటీసు కూడా ఇవ్వలేకపోయారు. కానీ, ఆళ్ళ నాని తన కాంగ్రెస్ సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. జాతీయస్థాయి పార్టీగా గొప్పలు చెప్పుకుంటూ తిరిగే కాంగ్రెస్ పెద్దలు షోకాజ్ నోటీసును శిలాక్షరాలతో తయారు చేసేలోపే నాని యమస్పీడయ్యారని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eluru-mla-alla-nani-24-14524.html
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.