Publish Date:Mar 26, 2025
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
Publish Date:Mar 26, 2025
బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో బాసటగా నిలిచారు.
Publish Date:Mar 26, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Publish Date:Mar 26, 2025
గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.
Publish Date:Mar 26, 2025
బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Publish Date:Mar 26, 2025
వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్పత్రి పాలయ్యారు.
Publish Date:Mar 26, 2025
హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన అప్సర అనే యువతిని 2033 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి కోర్టు సంచలన తీర్పు నిచ్చింది.
Publish Date:Mar 26, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది.
Publish Date:Mar 26, 2025
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Publish Date:Mar 26, 2025
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్(46) అనుమానాస్పదస్థితిలో మరణించాడు. డెడ్ బాడీపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ పక్కనే ప్రవీణ్ మృతదేహం పడి ఉంది. స్పాట్ లోనే రక్తపు మరకలతో ఉన్న కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో డెత్ మిస్టరీ వీడలేదు
Publish Date:Mar 26, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా? ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు.
Publish Date:Mar 26, 2025
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని కూనంనేని అన్నారు.
Publish Date:Mar 26, 2025
తెలుగుదేశం ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఇటువంటి భేటీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అమిత్ షాతో భేటీ అయిన సమయం, అంతకు ముందు రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) లోక్ సభలో లావు ప్రసంగం తరువాత అమిత్ షాతో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.