అర్నాబ్ తుపాను: ఒక్క ప్రాణం కూడా పోవద్దు.. అధికారులతో సమీక్షలో చంద్రబాబు దిశానిర్దేశం.!

Publish Date:Oct 26, 2026

Advertisement

అర్నాబ్  తీవ్ర తుపాను ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తుపానుగా, తీవ్ర తుపాను గా మారి  కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు రక్షణ చర్యలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ తీవ్ర తుపాను కారణంగా ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదనీ, అందుకుఅవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని  ఆయన విస్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

 విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తుపాను గమనం, తీరం దాటే ప్రాంతాలు, వర్షాల తీవ్రతపై ఈ సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమత్రికి నివేదించారు.  బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారిని ఆదేశించారు.  లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తక్షణమే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని   ఆదేశించారు.

ముఖ్యంగా తుపాను సమయంలో రమారమి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు   విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా టెలికాం శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.  అలాగే రోడ్లపై పడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు రోడ్డు రవాణా, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బందిని సన్నద్ధం చేయాలన్నారు.

రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కోత దశకు వచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాలకు లేదా గోదాములకు తరలించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

రాష్ట్ర,  జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను ఇప్పటికే అత్యంత ప్రభావితమయ్యే జిల్లాలకు తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షించాలని, ప్రజల నుంచి వచ్చే సహాయక అభ్యర్థనలకు వెంటనే స్పందించాలని చంద్రబాబు  ఆదేశించారు.  

[CM Chandrababu Review On Arnab Cyclone,   AP Government Cyclone Preparedness, Disaster Management,  Andhra PRadesh, Telugu One]

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.