అంబటి రాంబాబుకు జగన్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

Publish Date:Aug 30, 2026

Advertisement

 

హైదరాబాద్ అపోలోలో చికిత్స.. గుండెలో రెండు బ్లాకులు గుర్తింపు..!

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన అంబటి రాంబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఫోన్‌లో అంబటితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసు కున్న జగన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు. అంబటి రాంబాబు ఇటీవల అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరా బాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 

వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించి, వైద్యుల సూచన మేరకు స్టెంట్ చికిత్స చేపట్టారు. స్టెంట్‌ చికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. తన రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గుండెలో రెండు బ్లాకులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించారు. వెంటనే స్పందించిన వైద్య బృందం అవసరమైన చికిత్స అందించిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.

అంబటి రాంబాబు అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే స్టెంట్ చికిత్స విజయవంతం కావడం, ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం రావడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. తనను పరామర్శించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌కు రావొద్దని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, త్వరలోనే కోలుకుని గుంటూరుకు వస్తానని ఆయన తెలిపారు. రెండు రోజుల్లో గుంటూరు వచ్చి అందరినీ కలుస్తానని పేర్కొన్నట్లు సమాచారం.. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితిపై జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆరా తీయడం వైసీపీ వర్గాల్లో ప్రాధా న్యత సంతరించుకుంది. పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఆయన ఆరోగ్యంపై వివరాలు తెలుసుకుంటున్నారు.

 

Jagan calls Ambati Rambabu, YS Jagan, Treatment at Apollo, Stent treatment, Angiogram,   Ambati Rambabu ill, Telugu One, Telugu news
 

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.