సాక్షి బ్యాంకు అక్కౌంట్లను నిలిపివేసిన సిబిఐ
Publish Date:May 8, 2012
Advertisement
మంగళవారం సిబిఐ జగన్ మీడియా సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపేసింది. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్, సాక్షి టెలివిజన్‌ను నడిపే ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. సిఆర్‌పిసి 102 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలతో సిబిఐ ఆ ఖాతాలను స్తంభింపజేసింది. కొత్త ఖాతాలను తెరిచి, కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆ సంస్థలకు తెలిపింది. సాక్షికి సంబంధించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) ఖాతాలను, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. ఈ పరిణామం నేపథ్యంలో సాక్షి యాజమాన్యం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఖాతాల స్తంభనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సాక్షి దినపత్రికను ఆపించాలనే దురుద్దేశంతోనే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు. సాక్షికి సంబంధించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) ఖాతాలను, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. ఈ పరిణామం నేపథ్యంలో సాక్షి యాజమాన్యం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఖాతాల స్తంభనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సాక్షి దినపత్రికను ఆపించాలనే దురుద్దేశంతోనే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-bank-accounts--cbi-24-13908.html





