జడ్జీలపై దూషణలకు.. జగన్ సర్కారుకు లింకు!?

Publish Date:Feb 11, 2022

Advertisement

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరు? వైసీపీ నేతలు, అభిమానులు, జగన్ వీరాభిమానులు మాత్రమేనా? వారంతట వారే జడ్జీలను దూషించారా? లేక.. జగన్ సర్కార్ స్వయంగా కొందరి చేత ఈ పని చేయించిందా? 'దూషణల' మూలాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'డిజిటల్ కార్పొరేషన్'లోనూ ఉన్నాయా? సీబీఐ తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఔను' అనే సమాధానం వస్తోంది. వెరసి.. ఈ వివాదం జగన్ సర్కార్ మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదనిపిస్తోంది.

జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిస అలియాస్ కిషోర్ రెడ్డి దరిస, సుద్దులూరి అజయ్ అమృత్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

జడ్జిలపై కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాల ఆధారంగా వెతుకుతూ పోయినప్పుడు.. డిజిటల్ కార్పొరేషన్ లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. జడ్జీలపై పోస్టులను అక్కడే తయారుచేయించి, అక్కడి నుంచే సోషల్ మీడియాలోకి వదిలినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి డిజిటల్ మీడియాకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో జడ్జీలపై పెట్టిన అనుచిత వ్యాఖ్యలు అప్ లోడ్ అయిన ఐపీ అడ్రస్ లను సీబీఐ గుర్తించిందని, వాటిలో ప్రభుత్వానికి చెందిన ఈ-ప్రగతి, డిజిటల్ కార్పొరేషన్లకు చెందిన ఐపీ అడ్రస్ లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

'డిజిటల్ కార్పొరేషన్’ అనే ప్రత్యేక సంస్థను జగన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. మంగళగిరిలో దీనికి ఒకపెద్ద కార్యాలయం ఉంది. డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ.. అంతకుముందు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన అనేకమందికి డిజిటల్ కార్పొరేషన్ ళక్షఉపాధి కల్పించారు. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ కు చెందిన 'ఐ-ప్యాక్ బృందంలోని కొందరు కూడా ఇందులో పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.70 వేల దాకా జీతాలు అందుతున్నాయి. అంతకు ముందు వీరి జీతాలను వైసీపీయే చెల్లించేది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లిస్తుండడం గమనార్హం. ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి వీరంతా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ..వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

జడ్జిలపై సోషల్ మీడియా పోస్టులకు మూలాలు 'డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్నట్లు సీబీఐ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అది పూర్తిస్థాయిలో నిర్ధారణ అయితే.. సర్కార్ కు ఇక్కట్లు తప్పవని చెప్పొచ్చు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్ పెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ మారుతీ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ముఖ్య అనుచరుడు. ఢిల్లీ,  బెంగళూరుకు చెందిన ఒక డీఎస్పీ, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు మారుతీ రెడ్డి ఇంటిలో 12 గంటల పాటు విచారణ కొనసాగించారు. మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీని సీజ్ చేసి మరీ విచారించడం విశేషం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు హిందూపురం వెళ్లడం గమనార్హం. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబర్ 11న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది సీబీఐ.

ఇక.. ఇదే కేసులో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బుడ్డాయిపల్లికి చెందిన గంజికుంట మల్లికార్జున్ అనే వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ తతంగాన్ని చూస్తుంటే జగన్ సర్కార్ ఇరుకున పడే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.