మంచును మైనస్ చేశారా? విష్ణుకు జగన్ ఝలక్!

Publish Date:Feb 11, 2022

Advertisement

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును ఆయన సమీప బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైడ్ చేసేశారా? సీఎం జగన్‌కి, మంచు విష్ణుకి ఉన్న సంబంధం బావా బావమరది సంబంధం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచు విష్ణుకు సీఎం జగన్ మధ్య వ్యవహారం చెడిందా? ఆ క్రమంలోనే ముంచు విష్ణును కూరలో కరివేపాకు తీసినట్లు తీసి సీఎం జగన్ పక్కన పెట్టేశారా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. 

జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని సినిమా రంగంపై నీలి నీడలు కమ్ముకోవడంతో.. వెండి తెర వెలవెల బోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలు విడుదలకావడం లేదు. ఓ వేళ ఒకటి అర సినిమాలు మాత్రమే విడుదలవుతున్నాయి. కానీ భారీ బడ్జెట్‌లో నిర్మించిన పెద్ద సినిమాలు మాత్రం వాయిదా పద్దతిని అనుసరిస్తు.. విడుదలకు నోచుకోవడం లేదు. 

దీంతో చిత్ర పరిశ్రమలో ఓ విధమైన ప్రతిష్టంభన నెలకొంది. ఆ క్రమంలో మా అధ్యక్షుడి మంచు విష్ణు అధ్యక్షుడి హోదాలో తన బావ సీఎం జగన్‌తో మాట్లాడి.. తెర మీద బొమ్మ పడేందుకు.. తన శక్తి వంచన లేకుండా కృషి చేయడమే కాకుండా.. అవసరమైతే తెర వెనక చాలా కూల్‌గా వ్యవహరం చక్క బెడతారంటూ ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో టాక్ జోరుగా వైరల్ అయిందని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ రోజులు గడుస్తున్న.. ఈ వ్యవహారంపై మంచు విష్ణు కానీ, ఆయన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ సరైన సమయంలో సరైన విధంగా స్పందించ లేదు. ఈ నేపథ్యంలో ఈ తండ్రి కొడుకులపై  టాలీవుడ్‌లోని అగ్రహీరోల నుంచి లైట్ బాయి వరకు అందరు నిప్పులు చెరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఎన్నడు జరగని విధంగా గతేడాది.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే... మా అధ్యక్షుడిగా మా బెల్డింగ్ నిర్మిండచమే కాదు... టాలీవుడ్‌లోని అన్నీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ కూడా మంచు విష్ణు ఇచ్చారని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత.. థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు సైలెంట్ అంటూ స్లైడ్‌లో వచ్చే బొమ్మలాగా మంచు విష్ణు సైలెంట్ అయిపోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు ఫిలింనగర్‌లో జోరందుకున్నాయని సమాచారం.    

సమస్య వచ్చినప్పుడు.. సమర్థవంతంగా వ్యవహరించి.. అటు ప్రభుత్వానికి ఇటు చిత్ర పరిశ్రమకి మధ్య వారధిగా ఉంటూ.. పరిస్థితులు చక్కదిద్దే గుణం ఈ మా అధ్యక్షుడు మంచు విష్ణులో ఇంచుకైనా లేదని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యక్షుడు అయినా.. నాయకుడు అయినా.. వ్యవహారదక్షతతో వ్యవహరించి.. సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని వారు గుర్తు చేస్తున్నారు. కానీ మంచు విష్ణులో అవి లేవని.. మా అధ్యక్ష పదవి.. ఆయనకు ఓ అలంకారం మాత్రమేనని ఫిలింనగర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అదీకాక మంచు విష్ణు, సీఎం జగన్‌ల మధ్య రిలేషన్స్ దాదాపుగా కట్ అయిపోయాయనే టాక్ అయితే ఫిలింనగర్ వర్గాలు జోరుగా ఉంది. 

ఆ క్రమంలోనే సీఎం జగన్‌తో ఇటీవల మెగా స్టార్ చిరంజీవి భేటీ అయ్యారని.. వీరిద్దరి భేటీతో సినిమా పరిశ్రమకు సంబంధం లేదంటూ మీడియా సాక్షిగా మా అధ్యక్షుడుగా మంచు విష్ణు క్లియర్ కట్‌గా చెప్పడంతో ఈ విషయం స్పష్టమవుతోందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజగా ఫిబ్రవరి 10వ తేదీన సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళీ, కొరటాల శివ తదితరులు భేటీ అయి.. సినిమా పరిశ్రమలో నెలకొన సమస్యలపై కూలంకుషంగా చర్చించారని తెలుస్తోంది. ఈ సమస్యలకు ఫిబ్రవరి నెలాఖరులోగా శుభం కార్డు పడుతోందంటూ వారు పేర్కొన్న విషయం కూడా విధితమే. కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో మంచు విష్ణు కానీ.. ఆయన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ.. మంచు ఫ్యామిలీ కానీ ఎక్కడ కనిపించకపోవడంపై టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెర తీసినట్లు అయింది. 

మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్మాతగా.. ఆయన తండ్రి మంచు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ను... సరిగ్గా టాలీవుడ్ హీరోలు.. సీఎం జగన్‌తో అయిన రోజే విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌లో ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ అంటు మంచు మోహన్ బాబు చెప్పే డైలాగ్స్‌కు వీక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోందని... కానీ టాలీవుడ్‌లో ఓ వైపు సమస్యలతో సతమతం అవుతుంటే.. ప్రపంచం బాధే నా బాధ అన్నప్పుడు.. టాలీవుడ్ బాధ.. మీది కాదా ? అనే ప్రశ్నలు.. మంచు ఫ్యామిలీని నెట్‌జన్లు సోషల్ మీడియా సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికన్న మంచు ఫ్యామిలీ సమాధానం చెబుతుందో లేదో అని నెట్ జన్లు... కామెంట్స పెడుతున్నారు.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.