సీఈసీని తొలగించండి.. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు విపక్షాల నోటీసు

Publish Date:Apr 25, 2026

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ   ప్రతిపక్ష పార్టీలు తమ గళాన్ని పెంచాయి.  ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన సుమారు 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన  నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. భారత ఎన్నికల సంఘం పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, ఇప్పుడు నేరుగా సీఈసీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో   సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలనే ప్రతిపాదనతో కూడిన ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. 

ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.   ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు వెన్నెముకగా నిలిచే ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంశాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి ఏకంగా 73 మంది సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి అధికారికంగా నోటీసు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి,  ఎన్నికల కమిషన్‌కు ఒక సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.

నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో నిబంధనల అమలులో వివక్ష, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.  కీలకమైన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, ఓటర్ల జాబితాలో మార్పులు-చేర్పులు వంటి సున్నితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను సభ్యులు తమ నోటీసులు సభ్యులు పేర్కొన్నారు.  

రాజ్యసభ నిబంధనల ప్రకారం..  రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే తగిన సంఖ్యలో సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత నోటీసుపై 73 మంది సభ్యులు సంతకాలు చేయడంతో..  దీనిపై సభలో చర్చ జరగాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. చైర్మన్ ఈ నోటీసును పరిశీలించి, అది నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  నిర్ధారించుకునన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. సపోజ్ ఫర్ సపోజ్ ఈ నోటీసు ఆమోదం పొందితే, సభలో దీనిపై  చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత మరియు ఎన్నికల కోడ్ అమలు తీరుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజ్యాంగ సంస్థలు విఫలమవుతున్నాయని విపక్షాలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీని లక్ష్యంగా చేసుకుని విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది.  

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.