టైపింగ్ పొరపాటుకి ఇంత కక్షా? జగన్‌ను చరిత్ర క్షమించదన్న చంద్రబాబు
Publish Date:Feb 11, 2022
Advertisement
ఉద్యోగులకు ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రావాలని.. ఉద్యోగుల పక్షాన పోరాడటం ఎమ్మెల్సీ అశోక్‌బాబు చేసిన తప్పా? అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. క్విడ్‌ప్రోకోలో భాగంగానే అశోక్‌బాబుపై విజయవాడకు చెందిన మెహర్ కుమార్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ఆ మెహర్ కుమార్ భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్‌లో నామినేటెడ్ పదవి ఇచ్చారని గుర్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లోనూ అశోక్‌బాబు తన విద్యార్హత ఇంటర్ అని పేర్కొన్నారని స్పష్టం చేశారు. టైపింగ్ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంత కక్ష సాధింపా? ఉద్యోగులను రెచ్చగొట్టి మోసగించిందెవరు? అని చంద్రబాబు నిలదీశారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. ప్రతినెల పేదలపై వేల రూపాయల అదనపు భారం పడుతోంది. రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలు, ఉద్యోగులు ఆలోచించాలి. ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయలేం. రూ.2లక్షల కోట్ల సంపద గల అమరావతిని నాశనం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌ను చరిత్ర క్షమించదని విమర్శించారు చంద్రబాబు. గత 66 ఏళ్లలో చేసిన అప్పు రూ.3.14లక్షల కోట్లయితే.. ఇప్పుడు రాష్ట్ర అప్పు సుమారు రూ.7లక్షల కోట్లకు చేరిందని చంద్రబాబు అన్నారు. వ్యక్తులు మారుతారు కానీ లెక్కలు శాశ్వతమన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని.. అప్పును రూ.7లక్షల కోట్లకు తీసుకెళ్లిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఆస్తులను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తానే చివరి ముఖ్యమంత్రినని.. ఇక రాష్ట్రం ఉండదని జగన్ అనుకుంటున్నట్టున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సీఎం అంధకారం చేశారని.. రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. "మన రాష్ట్ర జనాభా రూ.5కోట్లు. ప్రతి కుటుంబంపైనా ఇప్పుడు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు అప్పు ఉంది. ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. కలెక్టరేట్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు.. ఇప్పుడు బెర్మ్ పార్కు తనఖా పెట్టారు. చివరికి రోడ్లు.. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తారు. అప్పుల్లో ఉన్నాం.. ఎవరమూ తప్పించుకోలేం. ఆకాశం నుంచి ఎవరూ రారు.. మనమే కట్టాలి. మరోవైపు పన్నులు విపరీతంగా పెంచారు. పెట్రోల్, గ్యాస్, మద్యం, విద్యుత్ ధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి. చివరికి చెత్త, మరుగుదొడ్లు, వారసత్వ ఆస్తులపైనా పన్నులు వేస్తున్నారు. ఎందుకీ పన్నుల భారం? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోని వెళ్తున్నాయి?" అంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
http://www.teluguone.com/news/content/chandrababu-fire-on-cm-jagan-39-131609.html





