Publish Date:Apr 24, 2026
ఇప్పటి వరకూ ఒక నటుడు పార్టీ పెట్టి పోటీ చేసిన తొలి ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్ల శాతం ఎంత? వీరిలో అత్యధిక ఓట్ల శాతం తెచ్చుకున్న ఆ గొప్ప నటుడు ఎవరు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రస్తుతం ఎన్నికల పరీక్షకు నిలపడంతో.. ఇతర నటుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నికల్లో పాల్గొన్నపుడు సాధించిన ఓట్ల శాతం ఎంత? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. వారిలో టాప్ మోస్ట్ ఎవరని చూస్తే.. డౌటెందుకు అన్న ఎన్టీఆర్. ఇదిరా తెలుగోడి సత్తా అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వారి ఓటింగ్ శాతమెంత? ఎన్టీఆర్ సాధించిన ఓట్ షేర్ ఏమిటి అని చూస్తే..
ఎన్టీఆర్.. పార్టీ స్థాపించిన 9 నెలలలో వచ్చిన ఎన్నికలలో తొలి సారి పోటీ చేసి.. 46.30శాతంతో పార్టీని 201 స్థానాలలో గెలిపించారు. ఇక ఎంజీఆర్ తన తొలి ప్రయత్నంలో 33.52శాతంతో 130 స్థానాలు, చిరంజీవి 16.32శాతంతో 18స్థానాలనూ దక్కించుకున్నారు. ఆ తరువాత తమిళనటుడు విజయకాంత్ తన పార్టీని తొలి ప్రయత్నంలో 8.38 ఓట్ల శాతంతో శాతంతో ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించారు. ఇక జపవన్ కళ్యాణ్- 5.53శాతంతో ఒక స్థానం, కమలహాసన్- 2.52శాతంతో జీరో స్థానాలు సాధించారు. ఇక ఇప్పుడు విజయ్.. తన తొలి ప్రయత్నంలో ఎంత శాతం ఓట్లు సాధిస్తారు? ఎన్ని సీట్లలో ఆయన పార్టీ విజయం సాధిస్తుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. సర్వేలను బట్టీ చూస్తే ఆయనకు 15- 19 శాతం ఓట్ షేర్ రావచ్చనీ.. ఆయన సాధించబోయే సీట్ల సంఖ్య ఓ డజను వరకూ ఉండొచ్చనీ అంటున్నారు సెఫాలజిస్టులు.
ఏది ఏమైనా ఒక నటుడు పెట్టిన పార్టీ తొలి ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం, గెలిచిన సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకూ ఎన్టీఆరే టాప్. ఇది మరో నటుడికి ఎప్పటికీ సాధ్యం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ ఆల్ టైం గ్రేట్ రికార్డ్ ని బ్రేక్ అయ్యే అవకాశాలే లేవని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anna-ntrs-record-is-unbreakable-39-218142.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!