యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకు పడింది. . సోమవారం (మే 4) జరపిన డ్రోన్ దాడిలో యూఏఈలోని వ్యూహాత్మక చమురు కేంద్రమైన ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు భారతీయ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇరాన్, యూఏఈలు ధృవీకరించాయి.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. గాయపడ్డ భారతీయులకు మెరుగైన వైద్య సేవలు అందేలా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
మరోవైపు, ఇరాన్ మొత్తం నాలుగు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. వీటిలో మూడింటిని యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగా.. మరొకటి సముద్రంలో పడిపోయింది. అయితే, ఇదే సమయంలో జరిగిన డ్రోన్ దాడి మాత్రం ఫుజైరా ఆయిల్ జోన్‌ను తాకడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఫుజైరా సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
గల్ఫ్ ప్రాంతంలో చమురు ఎగుమతులకు ఫుజైరా అత్యంత కీలకమైన హబ్. హోర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా చమురు రవాణా చేసే సామర్థ్యం దీనికి ఉండటంతోనే ఇరాన్ దీనిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ ఘటన అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది.
యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇది దేశ భద్రతపై జరిగిన దారుణమైన దాడిగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చేస్తున్న ఈ దాడులు అశాంతికి దారితీస్తాయని, దీనికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-attacks-uae-36-218963.html
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.