వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు.. అగ్రరాజ్యంపై ఇండియా ఆగ్రహం!

Publish Date:Jun 13, 2026

Advertisement

అంతర్జాతీయ సముద్ర జలాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. వాణిజ్య నౌకలపై  దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇండియా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో పలావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న  సెట్టెబెల్లో అనే ఒక వాణిజ్య ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నావికా దళం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు  మరణించిన సంగతి తెలిసిందే.  ఈ దాడిపై  భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలను అభిశంసిస్తూ.. స్పష్టమైన హెచ్చిరక జారీ చేసింది. 

ఈ  పరిణామంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్  అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడి, భారతదేశం తరఫున తీవ్ర నిరసన తెలిపారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం సముద్రంలో ప్రయాణించే నౌకలపై ఇలాంటి   దాడులు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్  హెచ్చరించారు.  అంతర్జాతీయ జలాల్లో జరిగే ఇలాంటి దాడులు సముద్ర వాణిజ్య భద్రత, ప్రాంతీయ స్థిరత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని జైశంర్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అన్ని దేశాలు తక్షణమే చర్యలు చేపట్టాలని భారత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.

ఈ ఘటనపై దౌత్యపరంగా మరింత ఒత్తిడి పెంచుతూ..  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ   ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి  జాసన్ మీక్స్‌ను  తమ కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. ఇండియన్  నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దళాలు  పదేపదే దాడులకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా చేసిన ఈ  దాడి కారణంగా ముగ్గురు ఇండియన్స్   ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని, అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తూ పౌరుల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా చెప్పింది.  

మరోవైపు ఈ వివాదాస్పద దాడిని అమెరికా సైనిక విభాగమైన సెంట్రల్ కమాండ్  అంగీకరించింది. ఇరాన్‌ దేశంపై అంతర్జాతీయంగా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఉల్లంఘిస్తూ..  సెట్టెబెల్లో' ట్యాంకర్ అక్కడి నుండి అక్రమంగా చమురును రవాణా చేయడానికి ప్రయత్నించిందని  ఆరోపించింది. తమ నౌకాదళ సిబ్బంది ఆ నౌకను ఆపాలని పదేపదే జారీ చేసిన హెచ్చరికలను పూర్తిగా ధిక్కరించడంతో  తాము బలప్రయోగం చేయాల్సి వచ్చిందని అమెరికా   సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏదేమైనప్పటికీ, కేవలం చమురు ఆంక్షల నెపంతో పౌర నావికుల ప్రాణాలను బలిగొనేలా అమెరికా ప్రవర్తించిన తీరుపై భారతదేశం మాత్రం ఎక్కడా తగ్గకుండా దౌత్యపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.