హైడ్రా కమిషనర్ కి తెలంగాణ హైకోర్టు ఫైన్

Publish Date:Jun 12, 2026

Advertisement

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా కు, హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడం ఎంతటి ఉన్నతాధికారికైనా చెల్లదంటూ   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు హైడ్రా కమిషనర్   రంగనాథ్‌కు   50 వేల రూపాయల జరిమానా విధించింది.   జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ శుక్రవారం  వెలువరించిన ఈ తీర్పు  రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఐఏఎస్,  ఐపీఎస్ అధికారుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే న్యాయస్థానాల పరిధిని దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమనే బలమైన సంకేతాన్ని ఈ తీర్పు ద్వారా హైకోర్టు పంపించింది.

ఈ వివాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్‌ నగర పరిధిలోని   ఖైరతాబాద్ మండలం  యూసఫ్‌గూడ  పరిధిలోని  సర్వే నంబర్ 45 లోని  రెండెకరాల భూవివాదం ఉంది. ఈ స్థలానికి సంబంధించి మహ్మద్ షఫాహతుల్లా అనే వ్యక్తి గతంలో న్యాయం కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ దాఖలు చేసిన ఆధారాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. ఆ వివాదాస్పద స్థలంలో యథాతథస్థితిని కొనసాగించాలంటూ గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆ భూమిలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అయితే..  ఈ న్యాయపరమైన ఆదేశాలను   లెక్కచేయకుండా హైడ్రా,  రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది. కోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ, అధికారులు అక్కడ ఉన్న ప్రహరీ గోడను  కూల్చివేసి, ఆపై చుట్టూ కొత్తగా కంచె ఏర్పాటు చేశారని పిటిషనర్  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఉల్లంఘనలపై విచారణ చేపట్టిన  తెలంగాణ హైకోర్టు..  హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు కోర్టు ఆదేశాలు ఉండగా ఈ కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో  వివరణ ఇస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైడ్రా కమిషనర్‌కు గతంలోనే న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ..  నిర్దేశిత సమయంలోగా హైడ్రా యంత్రాంగం కానీ,  కమిషనర్ స్పందించకపోవడం, కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా కోర్టు ధిక్కరనేనని కోర్టు పేర్కొంది.

 స్టేటస్ కో ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. హైడ్రా కమిషనర్  రంగనాథ్‌కు 50 వేల రూపాయలు జరిమానా విధిస్తూ.. ఈ జరిమానా మొత్తాన్ని  చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు  తక్షణమే చెల్లించాలని ఆదేశించింది.  సదరు   50 వేల రూపాయల జరిమానా రశీదును సమర్పించిన తర్వాతే, ఈ కేసుకు సంబంధించిన హైడ్రా కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీని   ఆదేశించింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై సరికొత్త ముందడుగు వేశారు.
అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. ఇక జులై 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు.
అధిక వడ్డీలు ఇస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన
బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్‌ ద్వివేది.. తాము ఈ అక్రమాల ప్రచారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సమించేది లేదనీ పేర్కొన్నారు నిజానిజాలను నిరూపించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని వేసినట్లు చెప్పిన ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
విజయవాడ సమీపంలో కంటైనర్‌ను ఢీకొట్టిన కారు..!
ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.