హైదరాబాద్ లో సీప్లేన్లు.. హుస్సేన్ సాగర్ జలాలలో ల్యాండిగ్.. టేకాఫ్.!

Publish Date:Sep 3, 2026

Advertisement

విశ్వనగరం హైదరాబాద్ సరికొత్త పర్యాటక శోభను సంతరించుకోనుంది. సముద్రం లేని రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో సీ-ప్లేన్ సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని విస్తరించడంతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రతిపాదనపై కసరత్తు చేపట్టింది.   రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖతో సంప్రదింపులు పూర్తి చేసింది. 

ఇటీవలి తన  ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. ఆ భేటీలో  తెలంగాణలో విమానయానాభివృద్ధికి సంబంధించిన   అంశాలపై  చర్చించారు. అందులో భాగంగానే  హుస్సేన్ సాగర్‌లో సీ-ప్లేన్ ఆపరేషన్లకు సంబంధించి  రేవంత్ రెడ్డి కింజరాపు రామ్మెహన్ నాయుడితో చర్చించి, తమ ప్రతిపాదనకు ఓకే చెప్పాల్సిందిగా కోరారు.

అందుకు కేంద్రమంత్రి కింజరాపు సానుకూలంగా స్పందించారు. రేవంత్ తో భేటీలో  వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన కాలపరిమితిని సమీక్షించామని కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అలాగే..  హుస్సేన్ సాగర్ నీటిపై సీ-ప్లేన్ల ల్యాండింగ్,  టేకాఫ్ ఆపరేషన్లను ప్రారంభించే   అంశంపై కూడా చర్చ జరిగిందన్నారు.   


[Hussain Sagar seaplane operations, Revanth Reddy Rammohan Naidu meeting, Hyderabad tourism updates, Telangana aviation projects, Hussain Sagar lake attractions]

By
en-us Political News

  
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.